Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మధిర బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు డబ్బులు లేక ఇక్కట్లు

మధిర బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు డబ్బులు లేక ఇక్కట్లు
ప్రచారం అయిపోయిన తర్వాత కలవరపడి కన్నీటి పరవంతమైన కమల్ రాజ్
కమల్ రాజ్ కన్నీటికి కారకులు ఎవరు…?
మధిరకు ఇంచార్జిగా ఉన్నమంత్రి అజయ్ మర్మమేమిటనేది చర్చ …
పార్టీ పై భగ్గుమంటున్న అనుయాయులు

ఖమ్మం జిల్లా మధిరలో అధికార బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ డబ్బులు లేక సతమవుతున్నట్లు సమాచారం …ఆయన ప్రచారం ముగియటానికి కొన్ని గంటల ముందుగా తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పరవంతమైనట్లు విశ్వసనీయ సమాచారం …తనకు డబ్బులు అందలేదని డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనని పంపుతామన్నవారు పంపలేదని బోరున విలపించారు …దీంతో కలత చెందిన అనుయాయులు పార్టీ కార్యాలయం ధ్వసం చేయాలనీ ప్రయత్నించగా కమల్ రాజ్ వారించినట్లు తెలుస్తుంది…ఇదే సందర్భంలో తన పరిస్థితిని తన అనుయాయులకు వివరించిన కమల్ రాజ్ నేను పేదవాడిని గత నాలుగున్నర సంవత్సరాలుగా జడ్పీ చైర్మెన్ గా మీలో ఒకడిగా ఉన్న రెండు వేల రూపాయలు పెట్టి ఓట్లు కొనే పరిస్థితి లేదు … నన్ను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అంటూ బిక్క మొఖం వేసి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు .. ఇది నియోజకవర్గంలో వైరల్ గా మారింది… కమల్ రాజ్ విజ్ఞప్తి ఓటర్లలో సానుభూతి నింపుతుందా …లేక తెల్ల జెండా ఎత్తాడనీ అనుకుంటారా …? అనేది చూడాలి .

అసలు పార్టీ అధిష్టానం కమల్ రాజ్ కు పంపిన డబ్బులు అందలేదా …? నిజంగా పంపిందా ..? పంపితే కమల్ రాజుకు ఎందుకు అందలేదు …? అనేది చర్చనీయాంశంగా మారింది …దీంతో తమదగ్గర డబ్బులు లేవని మధిర బిఆర్ఎస్ నేతలు చేతులెత్తేసినట్లు సమాచారం ..
పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారంటూ కారు పార్టీ నేతల్లో కలవరం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది…పార్టీ పై కొందరు నేతలు భగ్గుమంటున్నారని సమాచారం …మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమైయ్యారని తెలుస్తుంది …

మధిర ఎన్నికల ఇంఛార్జిగా మంత్రి పువ్వాడ ఉన్నారు … ఆయన్ను కలిసి స్వయంగా చర్చించి తన ఇబ్బందులు తొలగించుకునే బదులు అనవసరంగా అనుయాయుల సమావేశం ఏర్పాటు చేశారా ..? తన మనసులో మాటలు వారితో పంచుకుంటే భాద తీరుతుందని భావించగా అది రివర్స్ అయిందా …? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి…కొందరు అనుయాయులు మంత్రి తమకు అన్యాయం చేశారని దీంతో మంత్రి పువ్వాడ ఇంటి ముందు, జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేసేందుకు సిద్దపడగా , కమల్ రాజ్ వారిని వారించినట్లు తెలుస్తుంది …. ఎవరు ఆందోళన చేయొద్దంటూ ఆవేదన వ్యక్తంచేశారు … కమల్ రాజ్ కన్నీటికి కారణం ఏమిటి ..? వెనక కుట్రల కత్తులు ఎవరివి…..? అనేది చర్చినీయాంశంగా మారింది …పార్టీ తన నేతకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడం వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు ..?అసలు పార్టీలో ఉండాలా..? లేదా ..? మధిర నియోజకవర్గంలో మూకుమ్మడిగా గులాబీ నేతలు పార్టీ మారనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది….పోలింగ్ రేపు అనగా బీఆర్ యస్ లో జరుగుతున్న ఈపరిణామాలు మిగతా నియోజకవర్గాల అధికార పార్టీ అభ్యర్థులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి…దీనిపై పార్టీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు …అనే దానిపై మధిర బీఆర్ యస్ అభ్యర్థి భవిష్యత్ ఆధారపడి ఉంది …

Related posts

కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం:రేవంత్ రెడ్డి

Ram Narayana

కేసీఆర్ పాలన అంతా తప్పుల తడక అవినీతి అక్రమాల పుట్ట…పొంగులేటి ధ్వజం

Ram Narayana

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రేపు విడుదల?

Ram Narayana

Leave a Comment