- కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతల దాడి
- బీఆర్ఎస్ దాడి చేసిందంటూ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నిరసన
- కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను చెదరగొట్టిన పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీ తమపై చేసిన దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమపై మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నేత దాడి చేశారని వారు ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టారు.