Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...తెలంగాణ వార్తలు

కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి… బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు!

  • గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన కేసీఆర్
  • కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి
  • బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచే అవకాశముందన్న ఆరా మస్తాన్ సర్వే

తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. అయితే అందరి చూపు కామారెడ్డిపై ఉంది. ఇక్కడ స్వయంగా బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. ఇలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆరా మస్తాన్ సర్వే ప్రకారం… కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్ స్వల్ప మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది.

Related posts

ఇక పాలనపై ద్రుష్టి …సీతారామప్రాజెక్టు పరిశీలనకు ముగ్గురు మంత్రులు…

Ram Narayana

గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయి… అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు: డీజీపీ జితేందర్

Ram Narayana

జిల్లాల కుదింపు ఉండదు..వాటితో ప్రజలకు ప్రయోజనం ఉంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment