Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత

  • గురువారం డ్యామ్ వద్దకు చేరుకున్న పోలీసులు
  • ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉండడంతో ఉద్రిక్త వాతావరణం
  • బుధవారం అర్ధరాత్రి డ్యామ్‌ 13వ గేటు వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు
Once again tension at Sagar Dam as AP and Telangana polices deployed there

బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత తర్వాత నాగార్జున సాగర్ కుడి కాల్వ వద్ద గురువారం మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఇంకా అక్కడే ఉండడం ఇందుకు కారణమైంది. ఏపీ పోలీసులు బుధవారం రాత్రి నుంచి అక్కడే ఉండడంతో తెలంగాణ పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలావుండగా ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై బుధవారం అర్ధరాత్రి దాదాపు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అయితే డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసులు వారిపై దాడి చేశారు. 13వ గేట్‌ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.

పోలీసులను అడ్డుకున్న డ్యామ్ సిబ్బంది మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. అంతేకాకుండా డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌ వద్దకు చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడినా వెనక్కి తగ్గలేదన్న విషయం తెలిసిందే.

Related posts

రిపబ్లిక్ డేలో ఆకట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు

Ram Narayana

ఉద్యమ సూరీడికి నీరాజనం పలికేందుకు హైద్రాబాద్ సన్నద్ధం …

Ram Narayana

ఏపీ, తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న అత్యంత సంపన్న అభ్యర్థులు వీరే!

Ram Narayana

Leave a Comment