Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందా … ? అతి చేస్తుందా …?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడబోతున్నాయి… రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది… తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు… అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి… గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని… ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను అప్పుడే ముమ్మరం చేసింది. ట్రబుట్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఇప్పటికే హైదరాబాద్ కు పంపించింది. రేపు ఉదయం కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలా హైదరాబాద్ కు రానున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా రేపు సాయంత్రానికి హైదరాబాద్ కు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది.కాదు కాదు అతి చేస్తుంది…లేకపోతె కౌంటింగ్ జరుగుతుండగానే అభ్యర్థులను హైద్రాబాద్ రమ్మని కబురు చేయడం ఏమిటనే చర్చ జరుగుతుంది…119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో సిపిఐ కి మద్దతు ఇవ్వగా మిగతా 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది …ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి…అయితే 55 సీట్ల నుంచి 80 సీట్ల వరకు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని సర్వేలు తేల్చాయి…అసలు లెక్కలు రేపు కౌంటింగ్ లోగాని తెలియదు …బీఆర్ యస్ కూడా తమకు మూడవసారి అధికారంలోకి వస్తుందని అంటున్నాయి.కాంగ్రెస్ తరుపున ఎంతమంది గెలుస్తారు అనేది తెలియకుండా అందరిని కౌంటింగ్ వదిలి రమ్మనడం పై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు …ఇది మంచి పద్దతి కాదనే అభిప్రాయాలూ ఉన్నాయి…

కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన అభ్యర్థులను అదికూడా బొటాబొటిగా వస్తే ముందు జాగ్రత్తలుగా క్యాంపులకు తరలించడం జరుగుతుంది…ఆలా కాకుండా ముందుగానే రమ్మని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు …

Related posts

కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు… బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

Ram Narayana

మా ప్రచార ‘కారు’ను తీసుకెళ్లడం అప్రజాస్వామికం: కాంగ్రెస్

Ram Narayana

మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment