ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1
భట్టి , తుమ్మల ,పొంగులేటి ,భారీ మెజార్టీతో విజయం
ఇల్లందు లో కోరం కనకయ్య రికార్డు మెజార్టీ 57309
కొత్తగూడెం లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 26547 మెజార్టీ
మూడవ స్థానంతో సరిపెట్టుకున్న వనమా వెంకటేశ్వరరావు
మంత్రి పువ్వాడ అజయ్ ఓటమి …

శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విలక్షమైన తీర్పు ఇచ్చింది…ముందు నుంచి అనుకున్నట్లుగానే కాంగ్రెస్ కు ఖమ్మం ప్రజలు పట్టం కట్టారు …గత 10 సంవత్సరాల బీఆర్ యస్ పాలనకు చరమగీతం పాడుతూ ప్రత్యాన్మాయం కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ కు ఓట్ల రూపంలో తన మద్దతు తెలియజేశారు …గత పాలకులకు భిన్నంగా పరిపాలించాలని కోరుకున్నారు …ఖమ్మంలో పోలీస్ కేసులు ,భూకబ్జాలు , మట్టి కొండలు కరిగించడంపై కసిగా ఉన్న ప్రజలు తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ….అందువల్లనే ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి , మంత్రి అజయ్ ని 50 వేలకు పైగా ఓట్లతో ఓడించారు …ఇది నేతలకు కనువిప్పు కావాలని హెచ్చరికలు జారీచేసినట్లైంది …

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ యస్ కు చెందిన కందాల ఉపేందర్ రెడ్డి పై 56650 ఓట్ల మెజార్టీ తో ఘన విజయం సాధించారు …మొత్తం 21 రౌండ్లలో ఏ రౌండ్ లోను వెనకడుగు వేయకుండా సత్తా చాటారు …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 5308 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ పోగొట్టుకున్నారు …

ఇల్లందు నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య కు 57309 ఓట్ల రికార్డు మెజార్టీ రావడం విశేషం …బీఆర్ యస్ అభ్యర్థి హరిప్రియకు కనకయ్య కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం …
ఉమ్మడి జిల్లాలో గెలిచిన అభ్యర్థులకు సమీప అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ..

అశ్వారావుపేట ….జారే ఆదినారాయణ కాంగ్రెస్ కు 74993 ఓట్లు రాగా తన సమీప బీఆర్ యస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కు 46088 ఓట్లు వచ్చాయి…మెజార్టీ 28905

భద్రాచలం బీఆర్ యస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు 53252 ఓట్లతో విజయం సాధించగా , తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన పొదెం వీరయ్య కు 47533 ఓట్లు వచ్చాయి…మెజార్టీ 5719

కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు 80336 ఓట్లు రాగా ,తన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు కు 53789 ,ఓట్లు వచ్చాయి…మెజార్టీ 26547 ….బీఆర్ యస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు 37555 ఓట్లతో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది…

మధిర నుంచి భట్టి విక్రమార్కకు 107625 ఓట్లు రాగా తన ప్రత్యర్థి బీఆర్ యస్ కు చెందిన లింగాల కమల్ రాజ్ కు 72929 ఓట్లు వచ్చాయి….మెజార్టీ 35452

వైరా కాంగ్రెస్ అభ్యర్థి రామదాస్ నాయక్ 93913 ఓట్లను సంపాందించి బీఆర్ యస్ కు చెందిన మదన్ లాల్ కు 60868 ఓట్లు వచ్చాయి…రామదాస్ నాయక్ మెజార్టీ 33045 …

సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మట్టా రాగమయి….లక్షా 9 వేల 449 ఓట్లు రాగా బీఆర్ యస్ కు చెందిన సండ్ర వెంకటవీరయ్య కు 90974 , 18475 మెజార్టీ ఓట్లతో రాగమయి గెలుపొందారు ….

పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు 90510 ఓట్లను రాగా తన సమీప ప్రత్యర్థి బీఆర్ యస్ కు చెందిన రేగా కాంతారావు కు 56004 ఓట్లు రాగా పాయం మెజార్టీ 34506 …

పాలేరు లో పొంగులేటి వచ్చిన ఓట్లు లక్షా 27 వేల 820 కాగా , బీఆర్ యస్ కు అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి 71170 …పొంగులేటి మెజార్టీ 56650 ,

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరా కు లక్షా 36 వేల 16 ఓట్లు రాగా , తన ప్రత్యర్థి బీఆర్ యస్ కు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు 86635 ఓట్లను వచ్చాయి..మెజార్టీ 49381 ….