Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం …బీఆర్ యస్ ఎమ్మెల్యేతో కేసీఆర్

ప్రజల తీర్పుతో హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాను: కేసీఆర్

  • వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వానికి అవకాశం ఉందన్న కేసీఆర్
  • కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు సూచన
  • త్వరలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వానికి మనం సహకరిద్దామని… ఏం జరుగుతుందో చూద్దామన్నారు. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందని, ఫలితాలపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. త్వరలో పార్టీ శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్నారు. 

Related posts

సొంత ఊరికి మంచి చేయాలని భావించి… తిరిగిరాని లోకాలకు వెళ్లిన బిపిన్ రావత్!

Drukpadam

వంట నూనె ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి.. ఏపీ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు…

Drukpadam

భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ విస్తరించాలి…నామ

Drukpadam

Leave a Comment