- మల్లు భట్టి, ఉత్తమ్‌లతో కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే చర్చలు
- కాసేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించే అవకాశం
- పార్టీ విధేయులకు న్యాయం చేయాలని కోరిన సీనియర్ నేతలు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో వేణుగోపాల్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం గమనార్హం. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. మల్లు భట్టి, ఉత్తమ్‌లతో జరిగిన కీలక చర్చలలో కేసీ వేణుగోపాల్‌తో పాటు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలు కూడా పాల్గొన్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ… పార్టీ విధేయులకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తక్కువ సీట్లు వచ్చాయని, ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. విధేయతను, ట్రాక్ రికార్డును చూడాలని కోరారు.