Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి: కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన

  • సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన కేసీ వేణుగోపాల్
  • ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి
  • సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందని… టీమ్ వర్క్ చేస్తారని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీమ్ వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.

నిన్న డీకే శివకుమార్ ఆధ్వరంలో కొత్తగా ఎన్నికైన తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం హైద్రాబాద్ లోని హోటల్ ఎల్లా లో జరిగింది ..అప్పడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి..కొద్దీ సేపటికే ముఖ్యమంత్రి ఎంపిక భాద్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ..దీంతో సీన్ ఢిల్లీకి మారింది….పరిశీలకులుగా వచ్చిన నేతలు డీకే శివకుమార్ కలిసి ఢిల్లీకి వెళ్లారు …హైద్రాబాద్ నుంచి సీఎం పీఠం ఆశిస్తున్నా భట్టి , ఉత్తమ్ కూడా అక్కడకు చేరుకున్నారు ..ఉత్తమ్, భట్టి డీకే శివకుమార్ , మాణిక్య ఠాక్రే తో విడివిడిగా భేటీ అయ్యారు ..కేసి వేణుగోపాల్ ను కలిశారు …తమ అభిప్రాయాలను ఏఐసీసీ పెద్దలకు చేరవేశారు …అక్కడ నుంచి డీకే శివకుమార్ హైద్రాబాద్ వచ్చి సీఎం ఎవరనేది ప్రకటన చేస్తారని అనుకున్నారు …కానీ ఈలోపే ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు కేసి వేణుగోపాల్ సాయంత్రం 6 .30 లకు ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు …దీంతో ముఖ్యమంత్రి ప్రకటనపై సందిగ్ధం వీడినట్లు అయింది..ఈ ప్రకటన వెలువడిన వెంటనే హైద్రాబాద్ ఎల్లా హోటల్ బస చేసిన ఎమ్మెల్యేలు సంబరాలు జరుపుకున్నారు ..హైద్రాబాద్ లో రేవంత్ ఇంటివద్ద కోలాహలం నెలకొన్నది …రేవంత్ రెడ్డికి అదనపు భద్రతా కల్పించారు …

Related posts

హరీష్ రావు పై మైనంపల్లి విమర్శలు …కేసీఆర్ ,కేటీఆర్ ఆగ్రహం….

Ram Narayana

మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత: మావోయిస్ట్ బహిరంగ లేఖ

Ram Narayana

పార్టీ మార్పు ప్రచారం… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment