Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఓడించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించారు రాష్ట్రప్రజలు…కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించింది…రేవంత్ రెడ్డి ముందు ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు ఉన్నాయి…ప్రధానంగా ఇప్పటికే సీనియర్లు జూనియర్లు , కొత్త ,పాత మధ్య గ్యాప్ ఉంది …అంతే కాదు మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్ …సామాజికవర్గాలు , ప్రాంతాలు , చూడాల్సిన అవసరం ఉంది…అయితే సీనియర్లు మంత్రివర్గంలో ఉండవలసిన వారు అనేక మంది ఉన్నారు …ఎవరిని కాదన్నా వారికీ కోపంవస్తుంది …అయితే జంబో మంత్రివర్గాన్ని తీసుకుందామన్న కుదరదు ….తెలంగాణ రాష్ట్రలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితో సహా 18 మందికే అవకాశం ఉంది…దీంతో కూర్పు తలనొప్పితో కూడు కున్నదే …అంతే కాదు …రేవంత్ ఇప్పటివరకు కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు …ఎమ్మెల్సీగా ,ఎమ్మెల్యేగా ,ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉంది…పరిపాలన అనుభవం లేదు …అందువల్ల సలహాదారులు,అధికారులపై కొంతకాలం ఆధారపడక తప్పని పరిస్థితి … మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా భట్టి పేరు ఖరారు అయిన నేపథ్యంలో మంత్రి పదవులను కొంతమందికి కంపల్సరీ ఇవ్వాల్సి ఉండగా మరికొంతమంది ఆశిస్తున్నారు …వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,( ఉమ్మడి నల్గొండ) తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ఉమ్మడి ఖమ్మం జిల్లా ) సీతక్క , కొండా సురేఖ ,రేవూరి ప్రకాష్ రెడ్డి ( ఉమ్మడి వరంగల్ జిల్లా )దామోదర రాజనరసింహ ,మరొకరు (ఉమ్మడి మెదక్) పొన్నం ప్రభాకర్ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు (ఉమ్మడి కరీంనగర్ ) జూపెల్లి కృష్ణారావు ,మరొకరు ( ఉమ్మడి మహబూబ్ నగర్ ) ఇందులో ఒక ఎస్సీ , ఒక ఎస్టీ , ఒక ముస్లిం మైనార్టీ , బీసీలలో కులాలవారీగా సమీకరణాలు గెలిచినవారి నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది …

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు …ఇప్పటికే ఉద్యోగులకు ,పెన్షనర్లకు జీతం ప్రతినెలా మొదటి తేదీనే ఇవ్వాల్సి ఉండగా రెండవవారం , మూడవవారంలో గాని ఇవ్వడంలేదు …కనీసం మొదటివారంలో ఇవ్వాలనే డిమాండ్ ఉంది…అంతే కాకుండా డి ఏ బకాయిలు విడదల చేయకపోవడం , పీఆర్సీ రాకముందు ఇచ్చే ఐఆర్ ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు …ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం , లాంటి సమస్యలు ఉన్నాయి..రైతు బందు వెంటనే ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాల్సి ఉంది .. మహిళకు రూ 2500 ఇస్తామన్నారు ..అదే విధంగా పెన్షనర్లకు 4 వేల రూపాయల వాగ్దానాలు ఉన్నాయి..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…24 గంటలు ఉచిత విద్యుత్ , ఇందిరమ్మ ఇల్లు , ఇంటికి 5 లక్షలు సహాయం , ఉద్యమకారులకు 250 గజాల స్థలం , ఇంటినిర్మాణానికి నిధులు లాంటి వాగ్దానాలు ఉన్నాయి…రాష్ట్రంలో 5 లక్షల 50 వేల రూపాయల అప్పు ఉంది ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందిస్తుంది…కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనే ఆసక్తి నెలకొన్నది …

Related posts

టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు …

Ram Narayana

తెలంగాణాలో కారుదే జోరు 12 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం …ఎంపీ వద్దిరాజు

Ram Narayana

తెలంగాణాలో పోటీచేసే బీజేపీ లోకసభ అభ్యర్థులు ….

Ram Narayana

Leave a Comment