చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…
-దంపతుల మృతి బాధాకరమన్నపాలేరు ఎమ్మెల్యే పొంగులేటి
చెరువు మాదారంలో వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించిన దయాకర్ రెడ్డి
- రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువు మాదారంలో నూకతొట్టి పుల్లారావు, లక్ష్మీల ఇల్లు దెబ్బతిని మంగళవారం రాత్రి మట్టి గోడ కూలి మీద పడడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆ దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. దీనిపై పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు …తన కార్యాలయ ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డిని తక్షణమే చేరుమదరం వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి సహాయం అందించాలని ఆదేశించారు …ఆయన ఆదేశాల మేరకు దయాకర్ రెడ్డి బుధవారం వారి మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మిచౌంగ్ తుపానుతో పడుతున్న వానలకు మట్టిల్లు దెబ్బతిని ఇలా జరిగిందని, నిరుపేదలు చనిపోయారని స్థానికులు వివరించారు. స్పందించిన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అండగా ఉంటారని అభయమిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అభయమిచ్చారు. దయాకర్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, సర్పంచ్ సుజాత ఎంపీటీసీ పుష్పలత, స్థానికులు కృష్ణారెడ్డి, రవి, చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము, మరికంటి రమేష్ తదితరులు ఉన్నారు…