అనుముల రేవంతరెడ్డి అను నేను ……తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా …
గురువారం మధ్యాహ్నం 1 .04 నిమిషాలకు ప్రమాణం
రేవంత్ రెడ్డితోపాటు మరికొందరు మంత్రులు
ఆరుగురు లేదా తొమ్మిది మంది మంత్రుల ప్రమాణం
ప్రమాణ స్వీకారం చేయించుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళసై
అనంతరం అక్కడే కృతజ్ఞత సభ
అనుముల రేవంతరెడ్డి అను నేను …..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ రేపు మధ్యాహ్నం 1 .04 నిమిషాలకు ఎల్బీ స్టేడియం లో ప్రజల సాక్షిగా ప్రమాణం చేయనున్నారు … రాష్ట్ర గవర్నర్ తమిళ సై ముఖ్యమంత్రి ,మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు .. సీఎంతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం …ఇందులో డిప్యూటీ సీఎంలు గా మల్లు భట్టి విక్రమార్క , సీతక్క ఉండే అవకాశం ఉంది …మరో డిప్యూటీ సీఎం ఉంటె అది పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఉండవచ్చు …ఇక మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం …సీఎం తోసహా 18 మంత్రులు ఉండవచ్చు …స్పీకర్ గా ఎవరిని నియమించాలి …అనేది దానిపై ఫైనల్ అయిన తర్వాత మిగతా మంత్రులను నియమించే అవకాశం ఉంది …
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి అడుగుపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ కూర్పులపై సామాజికవర్గాల వారీగా రకరకాల ఆలోచనలు చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం ఎల్బీస్టేడియం వేదిక కానున్నది ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి , డీజీపీ రవిగుప్తా ఆధ్వరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి నాయకులందరినీ పేరుపేరునా ఆహ్వానించారు . వారికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాదులోని ఎల్లా హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా రేపు ప్రమాణస్వీకారం జరిగే వరకూ అక్కడే ఉంటారు. మొదటి విడతగా 9 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏమిటి అనేది ఇంకా స్పష్టత రాలేదు . 9 మందిలో డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క తో పాటు సీతక్క ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, బట్టి ఒక్కరే ఉంటారని మరో ప్రచారం ఉంది.. బిసి సామాజికవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ను ఉపముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇందులో గమనించాల్సింది ఏమిటంటే ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రికి ఎక్కడ ప్రాముఖ్యత లేదు .అయినప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవిని క్రియేట్ చేసి అసంతృప్త నాయకులు మెప్పించే పనులు ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ..అందులో భాగంగానే వారిని ఉపముఖ్యమంత్రి మంత్రులుగా ప్రకటిస్తున్నాయి దీంతో ఉపముఖ్యమంత్రుల విషయం ఒక ప్రవాసనంగా మారిందని వాదన కూడా ఉంది… ఉపముఖ్యమంత్రి అంటే చేతికి కొందరికి వచ్చే ఆరవ వేలుతో సమానమని నాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి అన్నట్లు భోగట్టా … అందుకని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామం ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ హోదా కలిగిన టిఆర్ఎస్ ఆచితూచి గమనిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుందా లేదా…? అని ఆలోచనలో ఉంది రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటికే ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు చేసిన వాగ్దానాలు సుమారు సాలీన లక్షన్నర కోట్ల రూపాయలు అవుతాయి… అందువల్ల వీటిని మీట్ కావటం అనేది పెద్ద సమస్య అవుతుంది… కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఆరు నెలలు అప్పుడు అధికార కాంగ్రెస్ పై తమ దాడిని ఎక్కుపెట్టాలనే ఆలోచలో ఉంది …