Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలనీ క్యాబినెట్ నిర్ణయం…రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు

గత ప్రభుత్వంలో అన్ని శాఖల ఆర్థిక కార్యాలపాలపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది …. ఈమేరకు ఆయా శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించింది … గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ,తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు మీడియా సమావేశంలో వెల్లడించారు …

విద్యుత్ విషయంలో అనేక తప్పుల తడకలు ఉన్నాయని దానిపై సమగ్ర సమీక్ష జరిపి చర్యలు చేపట్టాలని భావించింది …24 గంటల విద్యుత్ ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం మాభాద్యత అని శ్రీధర్ బాబు అన్నారు …తమ వాగ్దానం మేరకు ప్రతి గృహానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తాం … ఈనెల 9 శాసనసభ సమావేశమై నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేతో ప్రమాణస్వీకారం చేయించాలని నిర్ణయించాం …గవర్నర్ శాసనసభ ప్రొటెం స్పీకర్ ను సభ్యుల్లో సీనియర్ ను నియమిస్తారు ..ప్రొటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయిస్తారన్నారు . అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు …క్యాబినెట్ లో గ్రూప్ 1 , గ్రూప్ 2 పోస్టుల భర్తీపై కూడా క్యాబినెట్ లో చర్చించడం జరిగిందని శ్రీధర్ బాబు అన్నారు …గ్యారంటీలోని వెంటనే అమలు చేయబోతున్న పథకాలు సోనియా పొట్టిన రోజున ఈనెల 9 నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు …

Related posts

బండ్లగూడ జాగీలో వినాయకుడి లడ్డు ధర కోటి 26 లక్షలు…!

Ram Narayana

కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి…!

Drukpadam

కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలోనే 10 రోజులు ఉండాలి: యశోద ఆసుపత్రి వైద్యులు

Ram Narayana

Leave a Comment