Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కార్యకర్తలతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి.. ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నికల అనంతరం తొలిసారి పాలకుర్తికి ఎర్రబెల్లి
  • కార్యకర్తలతో మాట్లాడుతూ భావోద్వేగం
  • గెలుపోటములు సహజమన్న మాజీ మంత్రి
  • కార్యకర్తలు అధైర్యపడొద్దన్న బీఆర్ఎస్ నేత

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆపై కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తొలిసారి నిన్న పాలకుర్తి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలుపోటములు సహజమన్న ఆయన.. కార్యకర్తలు ఓపిగ్గా ఉండాలని కోరారు. తాను పాలకుర్తిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానన్న ఆయన తనపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు శాశనసభ ఏకగ్రీవ తీర్మానం….

Ram Narayana

ఇష్టంలేని పెళ్లి కొడుకులా అసెంబ్లీలో కేసీఆర్… కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా…!

Ram Narayana

Leave a Comment