Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి

  • గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి
  • బీఆర్ఎస్ నేతలు విశ్రాంతి తీసుకోవాలని సూచన
  • ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని ఆమె… మహిళలకు వివరించారు. అనంతరం ఆమె ఏబీఎన్‌తో మాట్లాడుతూ… బీఆర్ఎస్ వాళ్ళని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ నేతలు ఇక విశ్రాంతి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తమకు రాని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు కుళ్లుకొంటున్నారన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు.

Related posts

బీఆర్ఎస్ కు మరో షాక్.. దీపా దాస్ మున్షీతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి భేటీ!

Ram Narayana

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

బీఆర్ యస్ పై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఉద్యమం గడపగడపకు చేరాలి …సీఎల్పీ నేత భట్టి!

Ram Narayana

Leave a Comment