Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

  • ఇటీవల బాత్రూంలో జారిపడిన కేసీఆర్
  • యశోదా ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి
  • ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్
  • యశోదా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు
Chandrababu visits CM KCR at Yashoda Hospital in Hyderabad

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఇటీవల తన ఫాంహౌస్ వద్ద బాత్రూంలో జారిపడ్డారు. యశోదా ఆసుపత్రిలో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఈ సాయంత్రం యశోదా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లిన చంద్రబాబు… నమస్కారమండీ అంటూ కేసీఆర్ కు అభివాదం చేశారు. ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. 

కేసీఆర్ కొంచెం నీరసంగా మాట్లాడుతుండడంతో… ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

 కేసీఆర్ 6 వారాల్లో నడుస్తారని డాక్టర్లు చెప్పారు: చంద్రబాబు

11-12-2023 Mon 18:22 | Both States

  • బాత్రూంలో జారిపడిన కేసీఆర్… యశోదా ఆసుపత్రిలో హిప్ రీప్లేస్ మెంట్
  • నేడు కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు
  • కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత తృప్తిగా ఉందని వెల్లడి
  • కేసీఆర్ త్వరగా ప్రజాసేవకు పునరంకితం కావాలని చంద్రబాబు ఆకాంక్ష 
Chandrababu talks to media after visits KCR at Yashoda Hospital in Hyderabad

హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

“కె.చంద్రశేఖర్ రావు గారికి హిప్ ఆపరేషన్ జరగడంతో వారిని పరామర్శించడానికి వచ్చాను. ఆయనతో మాట్లాడాను. కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడితే, ఆయన కోలుకుని మామూలుగా నడవడానికి 6 వారాలు పడుతుందని చెప్పారు. కేసీఆర్ కు ఫిజియోథెరపీ అవసరమని కూడా చెప్పారు. 

కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంది. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 

ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. ఆయన జారి కిందపడడంతో హిప్ జాయింట్ కు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు చేసిన శస్త్రచికిత్స కూడా సఫలమైంది. వైద్యులు చెప్పిన వివరాలను బట్టి కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరుగుతారు. మెట్లెక్కడం, ఇతర పనులు మామూలుగానే చేసుకోవచ్చు. 

కేసీఆర్ పరిస్థితి తెలిశాక ఆయనతో ఓసారి మాట్లాడాలని అనిపించింది… అందుకే ఇవాళ ఆసుపత్రి వద్దకు వచ్చాను. కేసీఆర్ కోలుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చంద్రబాబు వివరించారు.

  • కేసీఆర్‌ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
RS Praveen Kumar meets KCR in Yashoda

Listen to the audio version of this article

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ పరామర్శించారు. ఆ తర్వాత మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిసి.. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మళ్లీ ప్రజల్లో తిరగాలన్నారు. కేసీఆర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీ హన్మంతరావు తదితరులు కలిశారు.

Related posts

కంటి ఆపరేషన్ పూర్తయ్యాక చిరునవ్వులు చిందిస్తూ చంద్రబాబు…!

Ram Narayana

త‌ల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మ‌కాకుండా పోతుందా?: వైఎస్ విజ‌య‌మ్మ‌

Ram Narayana

ముఖ్యమంత్రుల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క

Ram Narayana

Leave a Comment