Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఆధార్ వివరాల ఉచిత అప్ డేట్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం

  • ఆధార్ కార్డు పొంది పదేళ్లయితే వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటున్న కేంద్రం
  • గతంలో పొడిగించిన గడువు డిసెంబరు 14తో ముగింపు
  • తాజాగా వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగింపు
Center extends free update time line for AADHAR

Listen to the audio version of this article

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది. 

తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే… తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డు (రేషన్ కార్డు/ఓటరు కార్డు/పాస్ పోర్టు/కిసాన్ ఫొటో పాస్ బుక్/టీసీ/ మార్కుల జాబితా/పాన్/ఈ-పాన్/డ్రైవింగ్ లైసెన్స్)తో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 

ఇవే కాకుండా కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులను కూడా చిరునామా ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ చెబుతోంది. అయితే ఈ బిల్లులు ఇటీవల మూడు నెలల్లోపు చెల్లించినవి అయ్యుండాలి.

Related posts

బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం… 8 మంది మృతి

Ram Narayana

జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ

Ram Narayana

ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతం అదానీ.. ముకేశ్ అంబానీ వెనక్కి!

Ram Narayana

Leave a Comment