Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నాకు ఇప్పటి వరకు ఓటమి తెలియదు… గజ్వేల్‌లో ఓడాక కసి మరింతగా పెరిగింది: ఈటల

  • విద్యార్థి దశ నుంచే తనకు ఓటమి అంటే తెలియదన్న ఈటల
  • గజ్వేల్ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామన్న ఈటల
  • గజ్వేల్‌లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా కేసీఆర్ గెలిచారని ఆరోపణ

విద్యార్థి దశ నుంచే ఇప్పటి వరకు తనకు ఓటమి అంటే తెలియదని, ఇప్పుడు గజ్వేల్‌లో ఓటమితో  తనలో ఇంకా కసి పెరిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలతో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గజ్వేల్ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

డబ్బు, మద్యం పంచి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. ఇక్కడ నైతికంగా బీజేపీనే గెలిచిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదేకాదన్నారు. గజ్వేల్‌లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన గెలిచారని విమర్శించారు. ఈ ఓటమి తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు.

Related posts

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించిన కేసీఆర్

Ram Narayana

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి

Ram Narayana

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వనం

Ram Narayana

Leave a Comment