తెలంగాణ వార్తలు

డిప్యూటీ సీఎం భట్టి క్యాంపు కార్యాలయం ప్రజాభవన్….

అధికారిక నివాసం ప్రజాభవన్‌లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి కుటుంబం
  • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు
  • సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం
Deputy CM Bhatti Vikramarka entered the official residence Praja Bhavan along with his family

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్’లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో కూడా పూజలు చేశారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.

Related posts

చంద్రబాబును ఆదర్శంగా తీసుకోండి…రేవంత్ రెడ్డికి మంద కృష్ణ సలహా ..

Ram Narayana

జర్నలిస్టుల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఢిల్లీ జర్నలిస్టుల కృతజ్ఞతలు!

Ram Narayana

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..

Ram Narayana