
నా విజయం కోసం కార్పొరేటర్లు చేసిన కృషి అభినందనీయం
కబ్జాలు లేని ఖమ్మం అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
ఖమ్మం కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి తుమ్మల
ఖమ్మం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడంలో ఖమ్మం కార్పొరేటర్లు చేసిన కృషి అభినందనీయమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు
తెలంగాణా సచివాలయంలో వ్యవసాయ మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన తుమ్మల తన ఛాంబర్ లో ఖమ్మం కార్పొరేటర్లతో తొలి సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..కబ్జాలు లేని ఖమ్మం నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు
ఖమ్మం నియోజకవర్గ ప్రజలు రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టడం తన బాధ్యత ను మరింతగా పెంచిందని అన్నారు
ఖమ్మంలో కార్పొరేషన్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లకు అభివృద్ధి పనుల నిధులు కేటాయింపులో ఇప్పటి వరకు జరిగిన వివక్ష సరి దిద్దడానికి తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
ఖమ్మం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సూచించారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ కాంగ్రెస్ జిల్లా నాయకులు నల్లమల వెంకటేశ్వర రావు,సాధు రమేష్ రెడ్డి, చోటే బాబా తుపాకుల యలగొండ స్వామి, విజయ్ కుమార్ కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరి సైదుబాబు, లకవత్ సైదులు, చావ నారాయణరావు, మల్లి జగన్,SK ముక్తార్, నాగుల్ మీరా, దుద్దుకురి వెంకటేశ్వర్లు, మందడపు మనోహర్, పాకలపాటి శేషగిరి గారితో పాటు పట్టణ కాంగ్రెస్ సీనియర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు