Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతిస్తా: మాజీ మంత్రి మల్లారెడ్డి

  • అసెంబ్లీ నుంచి బయటకు వస్తుండగా మల్లారెడ్డికి ఎదురుపడ్డ తీన్మార్ మల్లన్న
  • మల్లన్నను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న మల్లారెడ్డి
  • అసెంబ్లీలో కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని ప్రశ్నించిన తీన్నార్ మల్లన్న

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది. ‘పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు వేసినా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే… ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా… కచ్చితంగా ఇస్తానని ఆయన బదులిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని… ఆ తర్వాత అందరం ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

తాను పార్టీ మారడంలేదు మొర్రో అంటున్న వివేక్ వెంకటస్వామి ….!

Ram Narayana

దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Ram Narayana

ఖమ్మం నుంచి తుమ్మల పాలేరు నుంచి పొంగులేటి …45 మందితో కాంగ్రెస్ రెండవ జాబితా ..!.

Ram Narayana

Leave a Comment