Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులుతెలుగు రాష్ట్రాలు

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!
ప్రతిదానిలో ఇంప్లీడ్ అవుతున్న సునీతా …సుప్రీం వరకు వెళ్లిన సునీతా
హత్యలో కొందరి ప్రమేయం ఉందని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారంటూ కృష్ణారెడ్డి పిటిషన్
సునీత దంపతులతో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు నమోదు చేయాలన్న కోర్టు
ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందులలో కేసు నమోదు

రాష్ట్రంలో సంచలనం సృష్టించ్చిన వైయస్ వివేకా హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు …అనేక మలుపులు తిరుగుతున్నది …ఈ కేసు మొదట స్థానిక పోలీసులు తర్వాత సిబిఐ విచారణ చేసింది…వివేకానంద రెడ్డి పీఏ తనను సునీతా దంపతులు వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రహించారు …దీంతో కోర్ట్ వారిపై కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీచేసింది.
వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… వివేకా హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి గతలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు.

హత్యలో కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని సీబీఐ అధికారులు, ముఖ్యంగా ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ లో ఆయన ఆరోపించారు. సీబీఐ అధికారులకు అనుగుణంగా సునీత, ఆమె భర్త కూడా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోయిందని… అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు… సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

చంద్రబాబు అరెస్ట్ పై మంద కృష్ణ స్పందన

Ram Narayana

అలా అయితే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేం…కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టుకు ఈడీ విజ్ఞప్తి

Ram Narayana

పోలింగ్ రోజున ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన…

Ram Narayana

Leave a Comment