Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పార్టీ కోసం పనిచేసే బీసీలు బెజవాడలో చాలామంది ఉన్నారు… వాళ్ల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తా: కేశినేని నాని

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని
  • వేల కోట్లు వెనకేసుకున్నవాళ్లు బీసీలు కాదని పరోక్ష వ్యాఖ్యలు
  • పేదవాళ్లయినా వ్యక్తిత్వం ఉంటే కాళ్లకు మొక్కుతానని వెల్లడి
  • డిప్యూటీ మేయర్ గోగుల రమణ నిజాయతీకి ప్రతిరూపం అని కితాబు

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని మరోసారి తన వ్యాఖ్యలతో చర్చకు అవకాశం ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే బీసీలు విజయవాడలో చాలామంది ఉన్నారని, అలాంటి వారి గెలుపు కోసం తానే స్వచ్ఛందంగా ముందుకువచ్చి పనిచేస్తానని కేశినేని నాని అన్నారు. 

కాల్ మనీ, సెక్స్ రాకెట్లో ఉన్నవాళ్లు, గూండాగిరీ చేసేవాళ్లు బీసీలు కాదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా వేల కోట్లు వెనకేసుకున్నవాళ్లు బీసీలు కాదని స్పష్టం చేశారు. పేదవాళ్లయినా వ్యక్తిత్వం ఉన్నవాళ్లయితే వారి కాళ్లకు మొక్కుతానని తెలిపారు. బీసీలు అంటే నీతి నిజాయతీతో పనిచేసే వారు అని, అలాంటి వారిలో విజయవాడ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఒకరని కేశినేని నాని కొనియాడారు. గోగుల రమణ డిప్యూటీ మేయర్ గా నిజాయతీకి ప్రతిరూపంగా నిలిచారని పేర్కొన్నారు.

Related posts

 మా సీఎం అభ్యర్థి చిరంజీవి: చింతా మోహన్

Ram Narayana

ఎవరు వద్దన్నా చంద్రబాబు తర్వాత నారా లోకేశే నాయకుడు: అచ్చెన్నాయుడు

Ram Narayana

టీడీపీకి కేశినేని శ్వేత గుడ్ బై …

Ram Narayana

Leave a Comment