Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి పొంగులేటి మార్క్ పరిపాలనలో చూపిస్తారా….?

మంత్రి పొంగులేటి మార్క్ పరిపాలనలో చూపిస్తారా….?
పాలేరులో ఘన విజయం సాధించిన నేతగా రికార్డులకెక్కిన పొంగులేటి
రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి
ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిపించాలని టార్గెట్ పని చేసిన పొంగులేటి
కసితో పనిచేసి లక్ష్యం చేరుకున్న పొంగులేటి
కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ …మొదటిసారే మంత్రిగా అవకాశం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి … పాలేరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ,రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన రెవెన్యూ , గ్రహనిర్మాణం ,సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రిగా భాద్యతలు స్వీకరించారు … ప్రజలందరూ ఆప్యాయంగా శీనన్నగా పిలుచుకునే పొంగులేటి అడుగులపై వేయికళ్లు చూస్తున్నాయి… తాను అనుకున్న శిఖరాలు ఎక్కడంలో తనదైన శైలిని కనబరుస్తుంటారనే పేరు ఆయనకు ఉంది …అత్యంత చురుకుదనం ,హుషారు ,కలుపుగోలుతనం ,ఆప్యాయత చూపించే పొంగులేటి పై ప్రజల్లో హై ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి…అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాన్నినిలబెట్టుకోవాల్సిన భాద్యత ఆయనపై ఉంది … రేవంత్ మంత్రివర్గంలో ఆయన కీలకమైన శాఖలు దక్కించుకున్నారు … మంత్రిగా తనకొచ్చిన అవకాశాన్ని ప్రజలు మెచ్చే విధంగా పనిచేయాల్సి చేయాల్సి ఉంటుంది …అందుకు తగ్గట్లుగా పొంగులేటి పరిపాలనలో తన మార్క్ చూపిస్తారా ..? లేదా …? అనేది ఆసక్తిగా మారింది …మంత్రిగా ఆయన నడక ఎలా ఉండబోతుంది… ప్రజలకు ఎలాంటి మేళ్ళు చేస్తారు … అనేది చర్చనీయాంశంగా మారింది …

2014 ఎన్నికల్లో వైయస్ ఆర్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసి మొదటిసారి ఖమ్మం ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన పొంగులేటి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు . … 2019 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ పొంగులేటిని పార్టీలో చేర్చుకునేపుడు తిరిగి ఇస్తానన్న ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వకుండా అవమానపరిచాడు …అయినా పార్టీలో జరిగిన పరిణామాలు చూస్తూ ఓపికగా భరించారు …చివరకు ఐదు సంవత్సరాలు పార్టీలో అనేక ఇబ్బందులు ,అవమానాలు భావించారు …2023 జనవరి 1 తేదీన బీఆర్ యస్ కు గుడ్ బై చెపుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు …ఒకరకంగా తన ఆత్మాభిమానం కేసీఆర్ దెబ్బగొడుతున్నాడని గ్రహించిన పొంగులేటి తిరుగుబావుటా వేగరవేశారు …ఏ పార్టీలో చేరాలనేదానిపై కొంతకాలం శషభిషలాడినప్పటికీ ఆలశ్యంగానైనా కాంగ్రెస్ లో చేరాలని అంత్యంత దైర్యంగా అడుగులు వేశారు … ఆయనపై ఎన్నికల సందర్భంగా ఐటీ దాడులు జరిగాయి…నామినేషన్ రోజునే ఐటీ అధికారుల బృందం ఆయన కంపెనీలు , నివాసాలు , బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి మానసికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ చెలించలేదు …తన భార్య , కొడుకు , సతీమణిలను ఐటీ అధికారులు ఖమ్మం నుంచి హైద్రాబాద్ కు తరలాలించిన సందర్భంగా కూడా నిబ్బరంగా ఉన్నారు … ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి
బీఆర్ యస్ కు చెందిన కందాల ఉపేందర్ రెడ్డి పై సుమారు 57 వేల ఓట్ల మెజార్టీ తో ఘన విషయం సాధించి చరిత్ర సృష్టించారు …

ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ యస్ అభ్యర్థ్దిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శపథం చేశారు …దీనిపై సీఎం తోసహా బీఆర్ యస్ నేతలు పొంగులేటిని ఎగతాళి చేశారు … కానీ ఆయన అనుకున్నట్లుగానే ఒక్క భద్రాచలం మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 సీట్లలో 8 కాంగ్రెస్ , ఒక్కటి మిత్రపక్షం సిపిఐ గెలిచింది…. అనూహ్యంగా ఖమ్మం జిల్లానుంచి సీఎల్పీ నేత భట్టి , మాజీమంత్రి తుమ్మల , పొంగులేటి భారీ మెజార్టీలతో విజయం సాధించారు …దీంతో ముగ్గురు ముఖ్యనేతలకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా భట్టి విక్రమార్క కు ఉపముఖ్యమంత్రితోపాటు ఆర్థిక , విద్యుత్ శాఖలను ,పొంగులేటి రెవెన్యూ ,సమాచార ,గ్రహనిర్మాణ శాఖలను , తుమ్మలకు వ్యవసాయ ఉత్పత్తులు ,జౌళి శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించడం ఖమ్మం జిల్లాకు ఇచ్చిన ప్రాధాన్యత ను తెలియజేస్తుంది….

Related posts

కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

Ram Narayana

సీఎం పదవిపై తన మనసులో మాట వెల్లడించిన కేటీఆర్

Ram Narayana

కమ్యూనిస్టులకు సీట్లు కేటాయింపుపై కాంగ్రెస్ మెలిక..ఒంటరి పోటీకి సిద్ధపడుతున్న సిపిఎం!

Ram Narayana

Leave a Comment