Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సిమిమా రాజకీయాలు …”వ్యూహం “పై టీడీపీ అభ్యతరం …

 ‘వ్యూహం’ సినిమా విడుదలపై ఆంక్షలు విధించిన సిటీ సివిల్ కోర్టు

  • చంద్రబాబు ఖ్యాతిని దెబ్బతీసేందుకే వ్యూహం సినిమా తీశారన్న లోకేశ్
  • హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్
  • సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని వెల్లడి
  • ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్  వేదికల్లో విడుదల చేయొద్దని సివిల్ కోర్టు ఆదేశాలు
Hyderabad City Civil Court interim orders on Vyuham movie

చంద్రబాబు పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేందు ‘వ్యూహం’ సినిమా తీశారని, ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

లోకేశ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… వ్యూహం చిత్రం విడుదలపై ఆంక్షలు విధించింది. వ్యూహం చిత్రాన్ని ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్  వేదికల్లో విడుదల చేయొద్దని సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యూహం చిత్ర నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, నారా లోకేశ్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

Related posts

సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కిస్తే రూ.150కోట్లకు పైనే.. షాకైన అధికారులు!

Drukpadam

సుమన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం…

Drukpadam

ఆస్కార్ అవార్డు తర్వాత హైద్రాబాద్ వచ్చిన జూనియర్ కు బ్రహ్మరథం …

Drukpadam

Leave a Comment