Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ అరెస్ట్.. మండిపడ్డ నారా లోకేశ్

  • అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • అక్రమ కేసులు నమోదు చేసి, టెర్రరిస్ట్ మాదిరి అరెస్ట్ చేశారని లోకేశ్ మండిపాటు
TDP NRI leader Yash Bodduluri arrested in Hyderabad airport

టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని కార్యాలయానికి తరలించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తోంది. యశ్ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

యశ్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని… నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి షాక్ కు గురయ్యానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఒక టెర్రరిస్టు మాదిరి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. యశ్ కి న్యాయం జరిగేంత వరకు విశ్రమించబోమని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

యశ్ అరెస్ట్ పై టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ఫైర్.. అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసనలకు పిలుపు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద యశ్ బొద్దులూరి అరెస్ట్
  • చివరి వంద రోజులన్నా జగన్ ప్రజాస్వామిక పాలన అందిస్తారనుకున్నామన్న కోమటి జయరాం
  • ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని మండిపాటు
Komati Jayaram condemns Yash Bodduluri arrest and calls of protests in all cities across USA

టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యశ్ అరెస్ట్ ను టీడీపీ కీలక ఎన్నారై నేత కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ చివరి వంద రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమోనని ఆశించామని… కానీ, తన వక్ర బుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని అన్నారు. యశ్ అక్రమ అరెస్ట్ ను అమెరికాలో ఉన్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. యశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

Related posts

పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడంటే .. పబ్లిక్ టాక్!

Ram Narayana

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు…

Ram Narayana

తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ చేసిన టీటీడీ

Ram Narayana

Leave a Comment