తుమ్మలకు నల్గొండ , పొంగులేటి వరంగల్ …ఇంచార్జి భాద్యతలు
కరీంనగర్ కు ఉత్తమ్ కుమార్… ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి… జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి
10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిల ప్రకటన
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఏ జిల్లా భాద్యతలు అప్పగించలేదు ..అయితే జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కు ఉమ్మడి నల్లగొండ , పొంగులేటి ఉమ్మడి వరంగల్ జిల్లాల భాద్యతలు అప్పగించారు …పరిపాలనను పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తుంటాయి…ఆక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రులను భాద్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది …
హైదరాబాద్ జిల్లాకు… పొన్నం ప్రభాకర్,
నిజామాబాద్ జిల్లాకు… జూపల్లి కృష్ణారావు,
కరీంనగర్ జిల్లాకు… ఉత్తమ్ కుమార్ రెడ్డి,
రంగారెడ్డి జిల్లాకు… దుద్దిళ్ల శ్రీధర్ బాబు,
ఖమ్మం జిల్లాకు… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
మహబూబ్ నగర్ జిల్లాకు… దామోదర రాజనర్సింహ,
నల్గొండ జిల్లాకు… తుమ్మల నాగేశ్వరరావు,
వరంగల్ జిల్లాకు… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
ఆదిలాబాద్ జిల్లాకు… సీతక్క,
మెదక్ జిల్లాకు… కొండా సురేఖను ఇన్చార్జిలుగా నియమించారు.