తెలంగాణ వార్తలు

తుమ్మలకు నల్గొండ , పొంగులేటి వరంగల్ …ఇంచార్జి భాద్యతలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ఏ జిల్లా భాద్యతలు అప్పగించలేదు ..అయితే జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కు ఉమ్మడి నల్లగొండ , పొంగులేటి ఉమ్మడి వరంగల్ జిల్లాల భాద్యతలు అప్పగించారు …పరిపాలనను పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తుంటాయి…ఆక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రులను భాద్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది …

Related posts

తెలంగాణలో వైద్య విద్యార్థులకు పెరిగిన ప్రభుత్వ పీజీ సీట్లు…

Ram Narayana

కల్తీ కల్లు ఘటన, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Ram Narayana

మంచిర్యాలలో విషాదం.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య!

Ram Narayana