Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ మరో యాత్ర.. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్ టు ముంబై

  • జనవరి 14న మణిపూర్ లో ప్రారంభించనున్న కాంగ్రెస్ మాజీ చీఫ్
  • 14 రాష్ట్రాలు, 85 జిల్లాల గుండా కొనసాగి మార్చి 20 న ముంబైలో ముగింపు
  • బస్సులో యాత్ర కొనసాగించనున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi to launch Bharat Nyay Yatra on January 14

భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర పేరుతో ‘మణిపూర్ నుంచి ముంబై’ యాత్ర చేపట్టనున్నారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని వెల్లడించింది.

ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.

Related posts

మోదీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు శశిథరూర్ చక్కని సమాధానం!

Ram Narayana

ఆరెస్సెస్‌లో ఉద్యోగులు చేరడంపై ఉన్న నిషేధం ఎత్తివేతపై విమర్శలు ..

Ram Narayana

తన వారసుడిగా మేనల్లుడిని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి…

Ram Narayana

Leave a Comment