అంతర్జాతీయం

పుష్కరకాలం తర్వాత తిరిగి తెరుచుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం

  • ప్రపంచంలోనే అతిపెద్దదైన అణువిద్యుత్ కేంద్రంగా కషివాజకి-కరివా ప్లాంట్
  • రెండేళ్ల క్రితం విధించిన ఆపరేషనల్ బ్యాన్‌ను ఎత్తివేసిన జపాన్ న్యూక్లియర్ పవర్ రెగ్యులేటర్
  • 2011 ఫుకుషిమా విపత్తు తర్వాత మూతబడిన అన్ని అణుకేంద్రాలను మూసేసిన జపాన్
Japan to restart worlds biggest nuclear plant after 12 years

12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అణుకేంద్రాన్ని తెరిచేందుకు జపాన్ రెడీ అయింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్‌ (టెప్కో)కు చెందిన కషివాజకి-కరివా పవర్ ప్లాంట్‌పై రెండేళ్ల క్రితం విధించిన ఆపరేషనల్ బ్యాన్‌ను జపాన్ న్యూక్లియర్ పవర్ రెగ్యులేటర్ ఎత్తివేసి ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని తిరిగి తెరవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని జపాన్ భావిస్తోంది. అయితే, జపాన్ తీరంలోని నీగటా ప్రిఫెక్చర్ (పాలనా అధికార పరిధి)లో ఉన్న ఈ ప్లాంట్ తిరిగి తెరవాలంటే మాత్రం స్థానిక సమ్మతి కూడా అవసరం. 8,212 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 2011 నుంచి మూతబడింది. ఫుకుషమా విపత్తు తర్వాత జపాన్ అన్ని అణువిద్యుత్ కేంద్రాలను మూసివేసింది. అప్పటి నుంచి మూతలోనే ఉన్న ఈ కేంద్రం త్వరలోనే తిరిగి తెరుచుకోనుంది.

Related posts

ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ… 69కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య!

Ram Narayana

వెనెజువెలాపై అమెరికా మిలిటరీ యాక్షన్?.. ట్రంప్ ఆదేశాలతోనే దాడులన్న మీడియా

Ram Narayana

అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. రష్యాకు దారి మళ్లింపు…

Ram Narayana