Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

గిప్పుడే ఆట మొదలైంది …కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..!

గిప్పుడే ఆట మొదలైంది…. లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ ఖజానా అప్పగించారని కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు … రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి గొప్పలు చెప్పమంటున్నారు….ఇది ఎక్కడి న్యాయం మోసపు మాటలతో పాలన చేశారు… ప్రజలకు ఏమి చెప్పకుండా దాచి పెట్టారు…. వారిలాగానే మమ్మల్ని కూడా చేయమని వారు కోరుతున్నారు… రాష్ట్రంలో 6 లక్షల 71 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది… కానీ వారు 3 లక్షల కోట్లే అప్పని అంటున్నారు … అసెంబ్లీలో దీనిపై మా ఆర్థిక మంత్రి స్పష్టంగా శ్వేత పత్రం విడుదల చేస్తే అసెంబ్లీలో మాట్లాడిన బావ బావమరుదులు దీని గురించి చెప్పకుండా ఇంటికి వెళ్లి అప్పులు లేవని చెప్తున్నారు… అప్పుల గురించి చెబితే తిరిగి అప్పులు పుట్టవని, రాష్ట్రం పరువు పోతుందని నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారు… ఇదెక్కడి న్యాయం ఉన్న విషయాలు చెప్పకుండా దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో దించమంటారా…? అంటూ ధ్వజమెత్తారు…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన అప్పగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే అప్పులు చేసి ఇష్టానుసారం దోచుకొని, దాచుకొని పైగా రాష్ట్రంపై అప్పుల భారం మోపి ఇది అభివృద్ధి అంటూ చంకలు గుద్దుకోవటం కేసిఆర్ కే చెల్లిందని ధ్వజమెత్తారు… అవసరం లేకపోయినా అప్పులు తెచ్చి సచివాలయం కట్టారు …అనేక నిర్మాణాలు ఎందుకు చేపట్టారో మీకు తెలుసు మాకు తెలుసు అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సీఎం అన్నారు… ఇదేనా మీ పాలన ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ విధానం అంటూ కేసీఆర్ పాలన వైఫల్యాలను వివరిస్తూ నిగ్గదీశారు… దీనిపై అసెంబ్లీలో వారికే ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ దాని గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడారు … అసెంబ్లీలో బావా బామ్మర్దులు తప్ప వారి పార్టీలో మరెవరికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు …ఇది వారి నైజం… బీఆర్ యస్ పరిపాలనలో కూడా కుటుంబ వ్యవహారమే నడిచింది… అందుకే రాష్ట్రం దివాలా తీసింది… వారు మాత్రం లక్షల కోట్లు దోచుకున్నారు… అందుకు తగిన ఫలితం అనుభవించాలి… ఇప్పుడే ఆటసురువైంది ఇక చూపిస్తాం తడాఖా అంటూ కేసీఆర్ అవలంబించిన విధానాలపై ముఖ్యమంతి విరుచుకపడ్డారు … అందుకే కాలేశ్వరం పైన ఇతర ప్రాజెక్టుల పైన సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం… ధరణిపై ఆదేశిస్తాం… ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి… వాటి అన్నిటి సంగతి తేలుస్తాం… పరిపాలన సక్రమంగా సాగేందుకు ప్రజల సహకరించాలి…. అందుకు కొంత సమయం తీసుకోవచ్చు…. అయినప్పటికీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తాం ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం … అందుకు శ్రీకారం చుట్టాం… ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో సభలు నిర్వహిస్తాం అక్కడే దరఖాస్తులు స్వీకరిస్తాం వారికి పథకాల అందించే ప్రయత్నం చేస్తున్నాం…. ఎక్కడ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది… ప్రజలు,ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సోదరులు అందరూ ఇందుకు సహకరించాలి… అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాం … ఇంతకుముందు సచివాలయంలోకి ఎవరూ వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు చూడండి సచివాలయం మీది మాది మన అందరిదీ…. ప్రజలది అందుకే వారికున్న సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రినీ, మంత్రులను కలిసేందుకు అవకాశం కల్పించాం… అధికారులు దగ్గర కూడా వారి సమస్యను చెప్పుకోవచ్చు … ఇది మంచి సువర్ణ అవకాశం దాన్ని వినియోగించుకోండి… రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది… అంతేకానీ నిజాలని అబద్ధాలు అబద్ధాలు నిజంగా చెప్పే వారి మాటలు నమ్మకండి… ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసింది దాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది … అందుకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

జర్నలిస్టుల సమస్యలు ఉన్నాయి…అవి మాకు తెలుసు ….తప్పకుండ మీకు న్యాయం చేస్తాం…కొంత సమయం ఇవ్వండి సీఎం జర్నలిస్టులను ఉద్దేశించి అన్నారు …అదే విధంగా సచివాలయంలో ఎప్పుడైనా మీడియా సమావేశం పెట్టారా …? లేదు ఇక నుంచి ఇక్కడే మీడియా కోసం ఒక హాల్ ఏర్పాటు చేయమని చీఫ్ సెక్రటరీకి చెప్పను … త్వరలో అది కార్యరూపం దాల్చుతుంది… ఆ హాల్ లోనే మీడియా సమావేశాలు ఉంటాయి…అవితే దాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు ..మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కోమటి రెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ , చీఫ్ సెక్రటరీ శాంతా కుమారిలు పాల్గొన్నారు …

Related posts

బీఎస్పీ నుంచి హిజ్రాకు వరంగల్ తూర్పు టికెట్.. సంబరాల్లో ట్రాన్స్‌జెండర్లు

Ram Narayana

మంత్రి పువ్వాడ అజయ్ సంపాదనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధర్మ సందేహం ….

Ram Narayana

రాజకీయాల్లో నీతికి పాతర …అన్ని పార్టీల్లో జంపింగ్ లు

Ram Narayana

Leave a Comment