Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

 ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత

  • చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయకాంత్ కన్నుమూత
  • ఆయన వయసు 71 సంవత్సరాలు
  • ఈ ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వైనం
Tamil actor Vijayakanth passes away

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. 

జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయను ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన కోలుకుని ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో, చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. అయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధరాణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్సను కొనసాగించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.

Related posts

విష్ణు నో అని ఉంటే నేనూ నో చెప్పేవాడిని: మోహన్ బాబు

Drukpadam

హీరో ఎవరైనా అంతిమంగా సినిమా గెలవాలి … పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్!

Drukpadam

మా’ సభ్యుల కోసం రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తా: ప్రకాశ్ రాజ్!

Drukpadam

Leave a Comment