Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పెద్ద అధికారుల కనుసన్నల్లోనే అక్రమార్కులకు రెగ్యులైరైజేషన్

ఒకటికాదు రెండు కాదు …ఖమ్మంనగరంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల భూములు అక్రమార్కులు చట్టబద్ధంగానే కాజేశారు …పేదోళ్లు కొద్దీ స్థలంలో గుడిసెలు వేస్తె తమ అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి బలవంతంగా ఖాళీ చేయించే అధికారులు ప్రభుత్వం ఇచ్చిన 58 ,59 జి ఓ ల ఆధారంగా కోట్ల రూపాయలు పలికే భూములను అధికార పార్టీకి చెందిన కొందరికి గుట్టుచప్పుడు కాకుండా రెగ్యులరైజ్ చేశారు … అప్పటి అధికార పార్టీ వత్తిడి మేరకు జిల్లా పెద్ద అధికారి తమ కింద అధికారులకు చెప్పి మరి అక్రమార్కులు చెప్పిన వాటిని సక్రమమేనని అధికార ముద్ర వేశారు …ఇలా ఒకటి కాదు రెండు కాదు …వందల కోట్ల రూపాయల భూములను అతితక్కువ ధరకు అప్పనంగా అప్పగించారు …ఖమ్మం నడిబొడ్డున అత్యంత విలువైన ఎన్ ఎస్ పి భూములను అధికార పార్టీ నగర నాయకుడికి అప్పగించడంపై వెలుగు చూడటంతో దాన్ని శనివారం రద్దుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో ప్రజలు అవాక్కు అయ్యారు … ఇంత తతంగం జరిగిందా…? అని మండిపడుతున్నారు …అధికార పార్టీలో ఉంటె ఏదైనా చేసుకోవచ్చా అనే చర్చ జరుగుతుంది..బీఆర్ యస్ నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీచేసిన మాజీమంత్రి పువ్వాడ అజయ్ ఓటమిలో ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని కారణాలుగా ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు … ఇలా ఒకటికాదు , రెండు కాదు అనేకం 58 ,59 జి ఓ లను అడ్డం పెట్టుకొని అధికారులను,అధికారపార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకొని రెగ్యులరైజ్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లు ఎత్తుతున్నాయి……అందులో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారివే కావడం గమనార్హం …ఇటీవలనే సమాచార హక్కు చట్టం కింద 58 ,59 జి ఓ లకింద రెగ్యులరైజేషన్ చేసుకున్న వారి వివరాలు బయటకు వచ్చాయి…వాటిలో సక్రమమైన ఎన్ని అక్రమైనవి ఎన్ని అని తేలాల్సి ఉంది ….

ఇప్పటివరకు జిల్లా అధికారులుగా ఉన్న పెద్ద అధికారులు అక్రమ రెగ్యులరైజేషన్ తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అని జిల్లా వదిలి వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు …అయితే అధికార మార్పిడి జరగడంతో కొత్తగా వచ్చిన మంత్రులు అందుకు అంగీకరించడంలేదున్నట్లు తెలుస్తుంది…రెగ్యులైరైజేషన్ చేసిన వారి వివరాలు పూర్తిగా ఇచ్చి అందుకు గల కారణాలు కూడా తెలిపిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్లాలని వారికీ సున్నితంగానే చెప్పినట్లు సమాచారం …దీంతో ఆ అధికారులు కక్కలేక మింగలేక ఉంటున్నారు ..ఇప్పడు ఏమి చేయాలో వారికీ పాలుపోవడంలేదు …అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినవాటిని అక్రమమైనా సక్రమమని చేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు … అప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే ఇబ్బందులు తప్పవని వారు చెప్పినట్లు చేసిన అధికారులకు రెగ్యులరైజేషన్ ఉచ్చు బిగుసుకునేలా ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…

Related posts

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్

Ram Narayana

రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …

Ram Narayana

మరణంలోనూ వీడని ఏడడుగుల బంధం.. ఖమ్మంలో వృద్ధ దంపతుల మృతి

Ram Narayana

Leave a Comment