Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మేడిగడ్డపై అధికారులకు ముచ్చెమటలు …పట్టించిన మంత్రి పొంగులేటి…!

కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ వద్ద బ్యారేజి కుంగిపోవడంతో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లు ఎత్తయి…ఎన్నికలకు ముందే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ,రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించి కేసీఆర్ ప్రభుత్వం డొల్లతనంపై విమర్శలు గుప్పించారు ..కేంద్ర ప్రభుత్వం సైతం సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులను పంపించి నివేదిక తెప్పించుకుంది … దీని నిర్మాణం చేసిన సంస్థ తిరిగి దాన్ని రిపేర్ చేస్తామని చెప్పింది …ఎన్నికల్లో ప్రభుత్వం మారింది …కేసీఆర్ ప్రభుత్వం ఓటమిపాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ….నిర్మాణ సంస్థ తాము ఏమి చేయలేమని చేతులేత్తిసింది …భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంస్థకు చేయాల్సిందేనని వార్నింగ్ సైతం ఇచ్చారు …శుక్రవారం మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన స్థలాన్ని మంత్రుల బృందం పర్యటించింది …బృందంలో నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు , రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , శాసనసభ వ్యవరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,రహణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , మాజీమంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , చెన్నూరు ఎమ్మెల్యే జి .వివేక్ తదితరులు ఉన్నారు ..ప్రాజెక్ట్ ప్రరిశీలించిన అనంతరం అక్కడ అధికారులతో మంత్రులు సమీక్షా నిర్వహించారు …ఈ సందర్భంగా పొంగులేటి లేవనెత్తిన ప్రశ్నలకు ఇంజనీరింగ్ అధికారులు నోరెళ్లబెట్టారు …నీళ్లు నమిలారు ..అధికారులకు మంత్రి పొంగులేటి ప్రశ్నల వర్షానికి ,సాధారణ అంశాలకే సమాధానం చెప్పలేక పోయారు ..కాళేశ్వరం లో మూడో టి ఎం సి పనులు ఎవరికోసం…? టెండర్లు పిలవకుండా కేసీఆర్ సన్నిహితులకు నామినేషన్ పద్దతి లో పనులు ఎందుకు ఇచ్చారు..?లో లెవల్ లో పంపులు ఎందుకు పెట్టారు…??పంపుల ముందు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పని చేయలేదు…?
గత ప్రభుత్వ పెద్దల పర్సనల్ ఇంటరెస్ట్ కోసమే పని చేశారు కాబట్టి ప్రజా ధనం వృధా అయింది నిజం కదా …?బ్యారేజి కట్ ఆఫ్ వాల్ ఆర్ సి సి తో కట్టివుంటే ఈ ప్రమాదం జరిగేదా…?మహారాష్ట్రకు మేలు జరిగేలా మేడిగడ్డ బ్యారేజిని 148 మీటర్లకే కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు ..బ్యారేజి కి డయా ఫ్రాం వాల్ కట్టాలనే నిబంధన ఎందుకు తప్పనిసరి చేయలేదు…? గోదావరి పై ఆప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ను ఎందుకు పరిగణన లోకి తీసుకోలేదు…?ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క వరదకే కొట్టుకు పోతాయా…?? ప్రమాదం 3 పిల్లర్ల కే పరిమితం కాదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు …పొంగులేటి సూచన తో బ్యారేజి పైకి మీడియాను అనుమతించాలని ఈ ఎన్ సి కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు …

Related posts

వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల నెల జీతం విరాళం: హరీశ్ రావు

Ram Narayana

జూపల్లి ప్రమేయంతోనే మా నాయకుడి హత్య… రేవంత్ రెడ్డి ఆయనను బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

Ram Narayana

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Ram Narayana

Leave a Comment