Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తా….మంత్రి తుమ్మల

ఖమ్మంలో జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం తప్పకుండ కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …శనివారం ఖమ్మంలో జర్నలిస్ట్ మిత్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన మాట్లాడుతూ …ఖమ్మం ప్రజలు తనను ఎంతో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని వారి ఋణం తప్పకుండ తీర్చుకుంటానని అన్నారు …ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించబోనని ,కేసులు పెట్టించి చికాకులు చేసే సంస్కృతీ తనది కాదని అన్నారు . ఖమ్మం అభివృద్ధికి గతంలో పనిచేశాను ..ఇప్పుడు ఇంకా భాద్యత ఉంది …నాసొంత నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు …ఎవరు పనులు వారు చేసుకొని ఖమ్మం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు …ప్రజల మౌలికసదుపాయాల కల్పన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు …కొన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లు కావాల్సి ఉందని ,అధికారులతో సమీక్షా చేసి ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ తయారు చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని పేర్కొన్నారు …జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన అన్ని విషయాలు తన మదిలో ఉన్నాయని అందుకు అనుగుణంగా ఖమ్మం ప్రజల ,కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా తన అడుగులు ఉంటాయన్నారు …ప్రత్యేకించి జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో మిగతా మంత్రులతో కూడా సమన్వయం చేసుకొని అందరికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ..ఈసమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ , కాంగ్రెస్ పార్టీ నాయకులూ సాధు రమేష్ రెడ్డి , కార్పొరేటర్లు కమర్తపు మురళి , చావా నారాయణరావు , సైదాబాబు ,దుద్దుకూరి వెంకటేశ్వర్లు బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు …

ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ పాత్రికేయులు నాగేళ్ల శివానంద్ కుమారుడు బ్రిటన్ దేశంలోని కౌంటీలో కౌన్సిలర్ గా ఎన్నికైన ఖమ్మం వచ్చిన సందర్భంగా ఒక కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు …ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మనదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళ దేశంలో మనవాడు గెలవడం మనకు గర్వకారణమని అన్నారు …శివానంద్ ను కుమారుడు నాగేందర్ ను తుమ్మలతో పాటు పలువురు పాత్రికేయలు అభినందించారు ..

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం…కూనంనేని

Ram Narayana

Leave a Comment