Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్

  • ఆక్లాండ్ లో మిన్నంటిన నూతన సంవత్సరాది సంబరాలు
  • బాణసంచా వెలుగులతో మెరిసిపోయిన స్కై టవర్
  • ప్రపంచంలో మొదటిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన కిరిబాటి దీవి
New Zealand welcomes new year 2024

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు పసిఫిక్ ద్వీప దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ నగరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 

ఇక్కడి ఆక్లాండ్ నగరం కొత్త సంవత్సరం 2024కి ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ వాసులు బాణసంచా కాల్చుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు షురూ చేశారు. ఆక్లాండ్ లోని ప్రఖ్యాత స్కై టవర్ బాణసంచా వెలుగుజిలుగులతో కాంతులీనింది. 

కాగా, ప్రపంచంలో మొట్టమొదట నూతన సంవత్సరానికి స్వాగతం పలికేది కిరిబాటి, టోంగా, సమోవా దీవులు. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్ కు చేరువలో ఉంటాయి. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో నూతన సంవత్సర ఘడియలు ప్రవేశిస్తాయి.

Related posts

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ హ‌తం.. ధ్రువీక‌రించిన‌ ఇజ్రాయెల్‌!

Ram Narayana

 సిడ్నీలో కళ్లు చెదిరే బాణసంచా విన్యాసాలతో నూతన సంవత్సర వేడుకలు… వీడియో ఇదిగో!

Ram Narayana

ఇజ్రాయెల్ రాజధాని లక్ష్యంగా 14 రాకెట్లు ప్రయోగించిన హమాస్

Ram Narayana

Leave a Comment