జనరల్ వార్తలు ...

2023కి వీడ్కోలు పలుకుతూ… తల్లికి ఇష్టమైన తియ్యని వంటకం చేసిన రాహుల్ గాంధీ… వీడియో ఇదిగో!

  • సోనియాగాంధీకి ఇష్టమైన వంటకం ఆరెంజ్ మార్మలేడ్
  • మేకింగ్ వీడియో పంచుకున్న రాహుల్ గాంధీ
  • అది తన సోదరి రెసిపీ అని వెల్లడి
Rahul Gandhi makes Orange Marmalade for his mother Sonia Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. నారింజ ఫలాలతో తయారుచేసే ఆ వంటకం పేరును రాహుల్ ఆరెంజ్ మార్మలేడ్ (జామ్) గా పేర్కొన్నారు. 

వాస్తవానికి ఆ రెసిపీ తన సోదరి ప్రియాంక గాంధీదని వెల్లడించారు. అంతేకాదు, ఆమె ఈ వంటకాన్ని అద్భుతంగా చేస్తుందని కితాబిచ్చారు. అయితే, 2023కి తియ్యటి వీడ్కోలు పలుకుతూ, ఈసారికి ఆరెంజ్ మార్మలేడ్ వంటకాన్ని తాను తయారుచేస్తున్నానని తెలిపారు. 

ఇక, తల్లితో కలిసి తోటలోకి వెళ్లి ఆరెంజ్ ఫలాలను కోసుకొచ్చి స్వయంగా జామ్ తయారుచేసిన రాహుల్… ఆ జామ్ ను తల్లితో కలిసి బాటిళ్లలో నింపారు.

Related posts

3 Fitness goals you need to ditch immediately, according to a pro

Ram Narayana

Google introduces Neural Networks API in DP of Android 8 Developer Review

Ram Narayana

జియో ఎయిర్‌ఫైబర్ కావాలా? ఇలా బుక్ చేసుకోండి!

Ram Narayana