రేపు ఎల్లుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లాలో పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శని ఆదివారాల్లో ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు శనివారం ఉదయం హైదరాబాదులోని తన నివాసం ప్రజా భవన్ నుంచి బయలుదేరి నేరుగా నందిగామ మీదుగా ఎర్రుపాలెం చేరుకుంటారు.. అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు . తర్వాత అక్కడ నుంచి మధిర చేరుకొని స్థానిక నాయకులను కలుస్తారు.. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రాత్రి అక్కడే బసచేసి మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజున ఆయన తన స్వగ్రామం స్నానాల లక్ష్మీపురం వెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు … తర్వాత అక్కడ నుంచి నేరుగా ఖమ్మం లోని తన నివాసం ప్రజాభవన్ కు చేరుకొని అధికారులు పార్టీ కార్యకర్తలను ప్రజలు కలుస్తారు … సాయంత్రం బయలుదేరి హైదరాబాదుకు వెళ్తారు . ఈ షెడ్యూల్ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రకటించింది … తగిన ఏర్పాట్లు ,బందోబస్తు నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియ చేసింది .. దీంతో డిప్యూటీ సీఎం రాక సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు తగిన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లా కలెక్టర్లు ఎస్పీ లు సీపీలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు…
డిప్యూటీ సీఎం అయినతరువాత ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పటికీ బట్టి విక్రమార్క కేవలం ఎర్రుపాలెం మండలంలో మాత్రమే పర్యటించి స్థాని కార్యక్రమంలో పాల్గొన్నారు .. అప్ప్పుడు ఆయన పర్యటనలు బిజీ గా ఉండటంతో ప్రజలను సరిగ కలవకుండానే వెళ్లారు .. దీంతో ఆయన రాక కోసం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదురుచూస్తున్నారు . మధిర , వైరా మండలాలతో పాటు ఖమ్మంలో ఆయన పర్యటన ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలుసుకునే అవకాశం ఉంది.. దీనికోసం పార్టీ యంత్రాంగం కూడా సిద్ధమైంది అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశం అయ్యే అవకాశం…
ఉపముఖ్యమంత్రి పదవితోపాటు , కీలక పదవులు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క వస్తున్నారనే సంగతి తెలియడంతో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు ప్రజలు కూడా ఖమ్మంలో కలిసేందుకు వీలుగా ఆయన కార్యక్రమం రూపొందించుకున్నారు .. ప్రధానంగా ఆర్థిక శాఖ తో పాటు విద్యుత్ శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నందుకు రెండు కీలక శాఖలకు మంత్రిగా , డిప్యూటీ సీఎం ఆయన పదవికి న్యాయం చేకూర్చాలని ప్రయత్నాల్లో ఉంటూనే వీలు జిల్లా పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు ..