Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పథకాలు అమలు కాకూడదనే దుర్బుద్ధితో ఉన్న బీఆర్ యస్ …డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో 7 లక్షల కోట్లు అప్పలు చేసి ఖజానా ఖాళీ చేసి ,రాష్ట్రాన్ని దివాళా తీయించిన బీఆర్ యస్ నేతలు కాంగ్రెస్ పథకాలు అమలు కాకూడదనే దుర్బుద్ధితో ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు …శనివారం మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం బనిగళ్లపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని పరిలించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28 రోజున 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ..

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం … సంపద సృష్టిస్తాం… సృష్టించిన సంపద ప్రజలకు పంచుతాం. ఇందిరమ్మ రాజ్యంలో సృష్టించిన సంపద దోపిడీ కాకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలను విశ్వసించి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని అన్నారు …

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణం స్వీకారం చేసిన గంటలోపే అదే ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు . అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాం విషయాన్నీ గుర్తు చేశారు ..

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండని కోరుకుంటున్న ప్రతిపక్షాల కలలను నిజం కానివ్వం… బిఆర్ఎస్ కంటున్న కలలు కల్లలుగానే మిగిలిపోతాయి
ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని ప్రజల చేత వాతలు పెట్టించుకుని అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు …ప్రజలు ఛీకొట్టిన
బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని వదిలిపెట్టకుండా ఉండకపోతే ఎలా? భట్టి ప్రశ్నించారు …

కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది గతంలో ఇండ్ల స్థలాలు పంచాం, ఇందిరమ్మ ఇల్లు కట్టించాం.
పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉండి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వలే.. కొత్త ఇండ్లు నిర్మించలేదన్నారు …ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఐదు లక్షలు సాయం ఖశ్చితంగా చేస్తుందన్నారు

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలను తాకట్టుపెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీతులు చెప్పేందుకు ప్రయతిస్తుందన్నారు …
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారుతాయని ప్రజలు కలలు కన్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఇండ్లు ,ఇంటి స్థలాలు వస్తాయని ప్రజలు కన్న కలలను గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కల్లలుగా మార్చిందని భట్టి దుయ్యబట్టారు ..

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న అధిగమిస్తాం… సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం ఇదే కాంగ్రెస్ మాట, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆచరణ అని భట్టి పునరుద్ఘాటించారు …ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసి ఆర్థిక పరిస్థితులను చెప్పాం…
ఈ సంవత్సరపు చివరి త్రైమాసిక నిధులను కూడా ఎన్నికలకు ముందే డ్రా చేసి గత బిఆర్ఎస్ పాలకులు ఖర్చు పెట్టారని అన్నారు ..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమించి ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ..గత ఐదు సంవత్సరాలుగా ఒకటో తారీకు నాడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్ధత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిది కదా అని ప్రశ్నించారు …

తెలంగాణ యువత కన్నటువంటి కలలను ఆశలను నిజం చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపిస్తామన్నారు ..

*కరెంటు కావాలా?
కాంగ్రెస్ కావాలా?
అన్నటువంటి బి ఆర్ ఎస్ కు చెంపపెట్టు లాగా కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు …

2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్తు ప్లాంట్లను నిర్మాణం చేయడంతో అవి ప్రొడక్షన్ లోకి వచ్చి గత పది సంవత్సరాలుగా తెలంగాణలో కరెంటు కోతలు లేవువని , అది తమ గొప్పతనమే అని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు .. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అవుట్ డెడ్ టెక్నాలజీతో నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు భారంగా మార్చారని బీఆర్ యస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు …

దామరచర్లలో నిర్మాణం చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు ప్రారంభం కాకుండా కరెంటును అప్పటి పాలకులు ఎక్కడి నుంచి ఇచ్చారావు చెప్పాలని అన్నారు ..

విద్యుత్తు రంగంపై 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం గత ప్రభుత్వ మోపినప్పటికీ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తాం..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి పై అధ్యాయం చేపట్టామని భట్టి అన్నారు ..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ ఈ ప్రభుత్వంలో మనందరం వాటాదారులమే రెవెన్యూ పై వచ్చే ప్రతి పైసా పెట్టుబడి పెడతాం ఆదాయం సృష్టిస్తాం వచ్చిన లాభాలు అందరికీ పంచడమే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన లక్ష్యం మన్నారు …ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రజాస్వామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని , విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు ..

మానవ వనరుల పై పెట్టుబడి పెట్టాలని ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం….ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రతి మండల కేంద్రంలో భూములను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు …
ఇంటర్నేషనల్ స్కూల్ కు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తాం… మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాం..ప్రపంచీకరణలో పెరిగిన పోటీ తత్వానికి అనుగుణంగా తెలంగాణ బిడ్డలు కూడా ఈ పోటీలో నిలబడే విధంగా తీర్చిదిద్దుతామని భట్టి అన్నారు …

ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన కళాశాల నిర్మాణానికి, గ్రామంలో రెండు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు …గ్రామంలో ఉన్న పీహెచ్ సి ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కావలసిన సౌకర్యాలు, సిబ్బందిని నియమిస్తామన్నారు …రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఓటు వేసి గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞుడిని తెలిపారు … నియోజకవర్గం ప్రజలు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలు కాపాడడం కోసం పని చేస్తానని అన్నారు ..

మామునూరు గ్రామంలో మిషన్ భగీరథ పై సమీక్ష

మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో మిషన్ భగీరథ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమీక్షా చేశారు .. సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ గౌతం, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఇతర అధికారులు హాజరైయ్యారు …పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ భగీరథ పథకం గురించి సీ.ఈ కే శ్రీనివాస్ డిప్యూటీ సీఎం ku వివరించారు .. ఈసందర్భంగా మిషన్ భగీరథ పైప్ లైన్ వేసే క్రమంలో రోడ్లను తవ్వి వదిలేయడం వల్ల ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నందున వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని భట్టి ఆదేశించారు.

Related posts

రాయల ,జావేద్ ,పోట్ల లకు ఢిల్లీలో బుజ్జగింపులు …కేసి వేణుగోపాలతో భేటీ …

Ram Narayana

అది నెట్ ప్రాక్టీస్! పార్టీలోని అంతర్గత గొడవపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…!

Ram Narayana

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

Leave a Comment