Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఈ ఎమ్మెల్యేలను మార్చే దమ్ముందా నీకు?: సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

  • పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదిలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నేను చెప్పిన ఈ ఎమ్మెల్యేలను మార్చే దమ్ముందా నీకు? అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

“ఆచంట ఎమ్మెల్యే… రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే. ఇంటి స్థలం కోసం రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు లంచం చెల్లించుకోవాలి. ఇళ్లు కట్టుకోవాలన్నా లంచం తప్పదు.

తణుకు ఎమ్మెల్యే… ఎర్రిపప్ప… సొంత ఊళ్లో రైతులకు ధాన్యం సంచులు ఇవ్వలేని ఈ ఎర్రిపప్పను ఏమనాలో అర్థం కావడంలేదు. నియోజకవర్గంలో ఏ నిర్మాణం జరగాలన్నా ఐదు శాతం ఈయనకు చెల్లించాలి. టీడీఆర్ బాండ్ల విషయంలో కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రమంతా ఆ కుంభకోణం పాకిపోయింది… ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీ అవినీతిని కక్కించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. 

తాడేపల్లి ఎమ్మెల్యే… చిల్లరకొట్టు పెట్టేశాడు. బిల్డింగ్ కట్టాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. లే అవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. అన్నింటికీ ట్యాక్సులే.

భీమవరంలో గజదొంగ ఉన్నాడు. మామూలు దొంగ కాదు… రూ.52 కోట్ల విలువైన భూమిని కొట్టేశాడు. జగన్ రుషికొండను కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టేస్తే… ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే కూడా ప్యాలెస్ కట్టేస్తున్నాడు. జగన్ తో పోటీ పడుతున్నాడు. పేదలకు ఇళ్లు కట్టరు కానీ వీళ్లు మాత్రం ప్యాలెస్ లు కట్టుకుంటున్నారు.

నరసాపురంలో ఇంకొకాయన  ఉన్నాడు. ఆయన పేరుకు తగ్గట్టే నియోజకవర్గాన్ని ప్రసాదం మాదిరిగా మింగేస్తున్నాడు. ఆయనొక ఎమ్మెల్యే… పేదలకు ఇళ్ల పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లు వేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటి గట్టు ఆధునికీకరణలో నాసిరకం పనులు చేసి రూ.15 కోట్లు మింగేశాడు. 

వీళ్లు ఎమ్మెల్యేలు…! ఇప్పుడు అడుగుతున్నా… జగన్ మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలను మార్చుతావా? నువ్వు చేయలేవు, అదీ నీ పరిస్థితి” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 

Related posts

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్​ కల్యాణ్​…

Ram Narayana

పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. మనసులో మాట బయటపెట్టిన యనమల!

Ram Narayana

వేమిరెడ్డి రూ. 1000 కోట్లు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చుపెడతారట: విజయసాయిరెడ్డి

Ram Narayana

Leave a Comment