- ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు!
- లోక్ సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
- తెలంగాణలో 17 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం
- ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్ పార్టీ
ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు కూడా సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తలుగా మంత్రులు, సీనియర్ నేతలను నియమించింది. ఇక, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అదనపు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాల సమన్వయకర్తగా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది.
ఇతర లోక్ సభ స్థానాల సమన్వయకర్తలు వీరే…
హైదరాబాద్, సికింద్రాబాద్- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు
భువనగిరి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్- కొండా సురేఖ
ఆదిలాబాద్- ధనసరి సీతక్క
మెదక్- దామోదర రాజనర్సింహ
నిజామాబాద్- జీవన్ రెడ్డి
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి- శ్రీధర్ బాబు
జహీరాబాద్- సుదర్శన్ రెడ్డి
ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్ పార్టీ
- త్వరలో లోక్ సభ ఎన్నికలు
- వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఏపీలోని 25 లోక్ సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ లోక్ సభ స్థానాల కోఆర్డినేటర్ల జాబితా
1. అరకు (ఎస్టీ)- జగతా శ్రీనివాస్
2. శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న
3. విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి
4. విశాఖపట్నం- కొత్తూరి శ్రీనివాస్
5. అనకాపల్లి- సనపాల అన్నాజీ రావు
6. కాకినాడ- కేబీఆర్ నాయుడు
7. అమలాపురం (ఎస్సీ)- ఎం. వెంకట శివప్రసాద్
8. రాజమండ్రి- ముసిని రామకృష్ణ
9. నరసాపురం- జెట్టి గురునాథరావు
10. ఏలూరు- కె. బాపిరాజు
11. మచిలీపట్నం- కొరివి వినయ్ కుమార్
12. విజయవాడ- డి. మురళీమోహన్ రావు
13. గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్
14. నరసరావుపేట- వి. గురునాథం
15. బాపట్ల (ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం
16. ఒంగోలు- యు. వెంకటరావు యాదవ్
17. నంద్యాల- బండి జక్రయ్య
18. కర్నూలు- పీఎం కమలమ్మ
19. అనంతపురం- ఎన్. శ్రీహరిప్రసాద్
20. హిందూపురం- షేక్ సత్తార్
21. కడప- ఎం. సుధాకర్ బాబు
22. నెల్లూరు- ఎం. రాజేశ్వరరావు
23. తిరుపతి (ఎస్సీ)- షేక్ నజీర్ అహ్మద్
24. రాజంపేట- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి
25. చిత్తూరు (ఎస్సీ)- డి. రాంభూపాల్ రెడ్డి