ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు పదవీగండం …
వి వి పాలెం ప్రాధమిక సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికైన నాగభూషణం
పేరెంట్ సోసిటీ లో ఆయన పై తిరుగుబాటు
13 మంది డైరెక్టర్లు ఉన్న సోసిటీలో లో 11 మంది అవిశ్వాసం నోటీసుపై సంతకాలు
సహకార అధికారి విజయనిర్మలను ఖమ్మంలోని కార్యాలయంలో కలిసి అవిశ్వాసం నోటీసులు అందించిన డైరక్టర్లు
చట్టప్రకారం 15 రోజుల్లో డైరెక్టర్ల అందరికి నోటీసులు అందించి సమావేశం పెడతామన్న అధికారి
ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రంజుగా మారె అవకాశం ఉంది …రాష్ట్రంలో బీఆర్ యస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ యస్ ద్వారా పదవులు పొందిన నేతలకు పదవి గండం వేలాడుతుంది….నామినేటెడ్ పదవులు పొందినవారు పదవులు రద్దు చేశారు …వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేశారు …ఇప్పడు ఆపదవుల్లో కాంగ్రెస్ కు చెందిన వారిని నియమిస్తారు … ఎన్నికైన కమిటీలు కూడా మారుతున్నాయి…జడ్పీ చైర్మన్లు , మున్సిపల్ ,ఎంపీపీ ,జడ్పీటీసీల పాలవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి…
ఖమ్మం జిల్లాలో మొదటగా డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభాషణం మెడపై కత్తి వేలాడుతుంది …విచిత్రమేమంటే డీసీసీబీ డైరెక్టర్లే ఆయన పై అవిశ్వాసం పెడతారనుకుంటే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన వి.వెంకటాయపాలెం ప్రాధమిక సహకార సంఘం డైరెక్టర్లు ఆయనపై అవిశ్వాసం పెట్టారు …మొత్తం సొసైటీ లో 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది డైరెక్టర్లు నాగభూషయ్య పై అవిశ్వాసం ప్రకటిస్తూ సంతకాలతో కూడిన వినతిని సహకార శాఖ అధికారి విజయనిర్మల అందజేశారు …మొత్తం 11 డైరెక్టర్లు నేరుగా వచ్చి సహకార శాఖ అధికారిని కలవడం గమనార్హం …దీంతో ఆయన పదవి పోవడం ఖాయంగా కనిపిస్తుంది….
ప్రాధమిక సహకార సంఘంలో పదవి కోల్పోతే అటోమెటిక్ గా డీసీసీబీ చైర్మన్ పదవి పోతుంది…అప్పడు కాంగ్రెస్ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కు చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…అయితే ఇప్పటివరకు బీఆర్ యస్ కు చెందిన వారే మెజార్టీ డీసీసీబీ లో డైరెక్టర్లుగా ఉన్నారు ….వారు కూడా పార్టీ మారె అవకాశాలు ఉన్నాయని సమాచారం….