మిర్చి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…
స్వయంగా మిర్చి కాయలు పట్టుకొని పరిశీలించిన మంత్రి..
మంచిగున్న కాయలకు ధర తగ్గించి ఇస్తున్న వారి పై ఆగ్రహం…
మిర్చి మార్కెట్ లో కమీషన్ దారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక…
క్వాలిటీ ఉన్న మిర్చి కూడా తక్కువ ధరకు కొనడం పై ఆగ్రహం…
మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసారు..
మిర్చి ధర తగ్గడం పై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ని ఖమ్మం రావాలని ఆదేశం..

ఖమ్మం మార్కెట్ దళారులకు అడ్డాగా మారింది …అధికారులు ,పాలకవర్గం కలిసి అమ్యామ్యాలకు అలవాటుపడి …అమాయకులైన రైతులను నిండాముంచుతున్నారు … రైతులు మార్కెట్కు తెచ్చిన సరుకును కొందరు వ్యాపారాలు సిండికేటుగా ఏర్పడి అడ్డికి పావుశేరు లెక్క కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు …దీనిపై స్పందించిన నాధుడు లేరు …రైతులు తెచ్చిన సరుకును అమ్ముకొని గిట్టుబాటు ధర లేక ,పెట్టిన పెట్టుబడులు రాక కన్నీళ్లు కుక్కుకుంటూ వెళుతున్న ఘటనలు కోకోల్లలు …

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం మిర్చి మార్కెట్ ను తనిఖీ చేశారు … ఖమ్మం మార్కెట్లో రైతులను నిలువునా దోచుకుంటున్న వ్యవహారం మంత్రి దృష్టికి రావడంతో శుక్రవారం ఆకస్మికంగా ఖమ్మం మార్కెట్ ను సందర్శించారు …ఈసందర్భంగా రైతులతో మాట్లాడు..మార్కెట్ కలయ తిరిగారు …జరుగునో మోసాలపై ఆరాతీసిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు …ఇక్కడ జరుగుతున్న అవకతవకలను పరిశీలించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతధికారులను ఖమ్మం రావాలని మంత్రి ఆదేశించారు …ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు …రైతులు మోస పోకుండా ఇతర శాఖలను సమన్వయం చేసుకొని రైతుకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు ..మిర్చి ధర తగ్గడం పై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ని వెంటనే ఖమ్మం రావాలని మంత్రి ఆదేశించారు …
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా మార్కెట్ కు వచ్చి తమ సమస్యలు తెలుసుకొని మిర్చికి ధర తగ్గకుండా చూడాలని ఆధికారులను ఆదేశించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు …