Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

 బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

  • అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట
  • శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని రాజాసింగ్ కు బెదిరింపులు
  • దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన రాజాసింగ్ 

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ పట్ల రాజాసింగ్ దీటుగా స్పందించారు. ఫోన్ లో బెదిరించడం కాదు… దమ్ముంటే నేరుగా వచ్చి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. 

ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్ కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపులపై అప్పటి డీజీపీకి ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు, తనకు పాకిస్థాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు.

Related posts

ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ రద్దు

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

Drukpadam

Leave a Comment