Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జనవరి 31లోగా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయండి… లేదంటే డియాక్టివేట్: ఎన్‌హెచ్ఏఐ

  • కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేయనున్నట్టు NHAI ప్రకటన
  • కేవైసీ పూర్తి చేయకుంటే.. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని సూచన
  • గడువులోగా కేవైసీ పూర్తి చేయాలని సూచన

ఫాస్టాగ్‌ల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 31వ తేదీలోగా కేవైసీ చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. 

కేవైసీ పూర్తి చేయకుంటే… ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని… ఈ అసౌకర్యాన్ని నివారించుకోవాలంటే యూజర్లు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని NHAI స్పష్టం చేసింది.

మరింత సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజా లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని NHAI సూచించింది. వాహనదారులు కొన్నిసార్లు ఫాస్టాగ్‌లను వాహనం ముందు పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతున్నారని… దాంతో టోల్ ప్లాజాలలో ఆలస్యం కావడంతో పాటు అందరినీ అసౌకర్యానికి గురి చేస్తోందని పేర్కొంది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు… ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని… ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని సూచించింది.

Related posts

త్వరలోనే కొత్త ఇంటికి రాహుల్ గాంధీ!

Drukpadam

పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు

Ram Narayana

2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు…

Drukpadam

Leave a Comment