Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీచేస్తే సరి లేకపోతె నాదే సీటు…రేణుకాచౌదరి

ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ పోటీచేస్తే సంతోషంగా ఆహ్వానిస్తాం, లేకపోతె సీటు నాదే అని మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అన్నారు ..గురువారం ఖమ్మం వచ్చిన ఆమె జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … సోనియా లేదా ప్రియాంక రాష్ట్రం నుంచి పోటీచేస్తే ఆప్రభావం తప్పకుండ ఉంటుంది …పోటీచేయాలని కోరుకుంటున్న సోనియా నిర్ణయం తర్వాతే ఖమ్మం సీటుపై స్పష్టత వస్తుంది …ఇందులో మరో మాటకు తావు లేదు …ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట …ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని కత్తులు అందువల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో విజయడంకా మోగించగలిగామని పేర్కొన్నారు …

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాగుతున్నది మా మోచేయి నీళ్లు.. ఖమ్మంలో గత పాలకుల అండతో జరిగిన కబ్జాలన్నీటిని తిరిగి వెనక్కి రప్పిస్తాం… ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను జోస్యం చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటిందని తాను చెప్పినట్లే ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోయారని ఆమె అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఉంటాయన్నారు .

ఖమ్మంలో కబ్జాలకు గురైన స్థలాలను తాను పరిశీలించేందుకే వచ్చానని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేస్తుందని అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం జరిగిందన్నారు. దీనిపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని తనతో అనేకమంది మహిళలు చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు….

చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన సీతారాములు మా భద్రాచలంలో ఉన్నారు. వారి ఆలయం రామదాసు నిర్మిస్తే ఆయనను అప్పటి రాజులు బంధీని చేశారు… ఇటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు.. శ్రీరాముడు గౌరవాన్ని బ్యాలెట్ బాక్స్ స్థాయికి దించారు…ఇది అత్యంత జుగుస్సాకరం … ఎన్నికల నోటిఫికేషను ముందు గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట సరికాదు… ఈ మాట అనేకమంది ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు నా అభిప్రాయం కూడా అదే అన్నారు …

ఖమ్మం ఖిల్లా అభివృద్ధిలో భాగంగా సౌండ్ అండ్ లైట్నింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించానని, ఆ నిధులు ఆ తర్వాత ఏమయ్యాయో అర్థం కాలేదు అన్నారు. ఆ నిధులకు సంబంధించి ఆడిట్ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఖమ్మంలో తరుణ్ హాట్ ఏర్పాటు చేసి అందులో అప్పట్లో నిర్వహించిన స్తంభాద్రి ఉత్సవాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకునేవని అన్నారు . మళ్ళీ ఆ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు .జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం అదృష్టం అన్నారు.
పునుకుల గ్రామంలో గతంలో ఆర్గానిక్ పత్తి ఉత్పత్తులు వచ్చే విధంగా చేసిన కృషిని ఆమె గుర్తు చేశారు…

Related posts

బీజేపీలో ఈటెలపై గుస్సా …!

Drukpadam

కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్..

Ram Narayana

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

Ram Narayana

Leave a Comment