బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయ పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్లిప్ డిస్క్ వంటి గాయానికి వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు సైతం ఆయనకు విశ్రాంతి అవసరమని అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ కూడా డాక్టర్ల సూచన మేరకు తాత్కాలికంగా తన కార్యకలాపాలకు విరామం ఇవ్వనున్నారు. “చిన్న గాయం మాత్రమే. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల ముందుకు వస్తాను,” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మానసికంగా తాను బలంగా ఉన్నానని, త్వరలోనే తన రాజకీయ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: