Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ ?

ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ ?
ఏఐసీసీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ ని నియమించబోతున్నారా ? అంటే అందుకు ఉన్న అవకాశాలను మాత్రం కొట్టి పారేయలేమని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు . రాహుల్ గాంధీ ని తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాద్యతలు తీసుకోమని ఇప్పటికి ఏఐసీసీ , వర్కింగ్ కమిటీలు , వత్తిడి తెస్తున్నాయి . అందుకు ఆయన ససేమిరా అంటున్నారు .తమ కుటుంభం నుంచి కాకుండా బయట వ్యక్తుల నుంచి అధ్యక్షుని ఎన్నిక జరగాలని అంటున్నారని వార్తలు వచ్చాయి . అయినా ఆయన పై వత్తిడి పెరుగుతూనే ఉంది . మరో సారి ఆయన నో చెపితే అందరి చూపులు ప్రియాంక గాంధీ వైపు ఉన్నాయి . ప్రియాంక రాజకీయాలలో యాక్టివ్ అయినా తరువాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఉత్తరప్రదేశ్ భాద్యతలు అప్పగించారు . ఆమెను దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకొంటున్నారు . ప్రియాంక చూపుల్లో చురుకు దనం, మాటల్లో ముక్కుసూటి తనం , రూపంలో తన నానమ్మ ఇందిరా గాంధీ ని పోలివుండటంతో కాంగ్రెస్ పార్టీకి కలసి వస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి . గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షులుగా ఉన్నారు . ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో ఆయన తన పదవి నుంచి తప్పుకొన్నారు . అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు లేని పార్టీగానే ఉంటుంది . రాహుల్ గాంధీ రాజీనామా చేసిన అనంతరం ఆయన రాజీనామా ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై సోనియా గాంధీ ని ఆమె ఆరోగ్యం సరిగా లేక పోయిన తాత్కాలిక అధ్యక్షురాలుగా బలవంతంగా నియమించారు . ఈనియమాకం సందర్భంగానే ఆరు నెలల్లో ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షున్ని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు . కాని కోవిద్ మహమ్మారి వలన పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు . దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి . గతంలో జరిగిన అనేక ఎన్నికలలో భాద్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల భాద్యత కూడా తీసుకున్నారు . గతంకంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పోటీచేసేలా ఆర్ జే డి తో ఒప్పదం కుదుర్చుకొన్నాడు . అంత వరకు బాగానే ఉన్న కాంగ్రెస్ పోటీ చేసిన మెజార్టీ సీట్లలో ఓడిపోయింది . ఫలితంగా అక్కడ అధికారంలోకి వస్తుందని భావించిన ఆర్ జే డి రాకుండా పోయింది . దీంతో కాంగ్రెస్ సీనియర్లకు కోపం వచ్చింది . గతంలో సంస్థాగత ఎన్నికలను గురించి సోనియాకు లేక రాసిన 23 మంది తమగళం వినిపిస్తూనే ఉన్నారు . బీహార్ ఫలితాల ప్రతికూలంగా రావటంతో ఏఐసీసీ నాయకత్వం పై మరోసారి సీనియర్లు దాడి ప్రారంభించారు . దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక, సోనియాని ఒప్పించి అసమ్మతి నేతలతో సమావేశం ఏర్పాటు చేయించారు . అంతకు ముందు రాజస్థాన్ లో వచ్చిన క్రైసిస్ ను సద్దుమణిగేలా చేయటంలో కూడా ప్రియాంకనే చొరవ చూపారు . అసమ్మతి నేత సచిన్ పైలెట్ కు నచ్చచెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ ని వీడకుండా ఒప్పించగలిగారు . దీంతో పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా కొంత క్రేజ్ ఉన్న నాయకురాలుగా ప్రియాంక గాంధీ కి తన నానమ్మ పోలికలు ఉండటం తో ఆమెలో ఇందిరా గాంధీ చూసుకుంటున్నారు . అందువల్ల ఆమె దేశవ్యాపితంగా ప్రచారం నిర్వహించగలిగితే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటుందనే వాదనలు కాంగ్రెస్ లోనే బలంగా ఉన్నాయి . ప్రియాంక అయితే రాహుల్ ఎలాగూ తన వంతు పాత్ర పోషిస్తాడు, క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు కనుక కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ లో ఉంది . ఈ ప్రతి పాదనలను అసమ్మతి నేతలు సైతం వ్యతిరేకించటంలేదు . అయితే గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనా తమకు అభ్యతరం లేదని రాహుల్, ప్రియాంక లు అంటున్నారని , అప్పుడు ఎవరైతే బాగుంటుందనే చర్చ కూడా ఉంది . కానీ కాంగ్రెస్ కార్యకర్తలు , వివిధ రాష్ట్రాలలోని , పీసీసీ అధ్యక్షులు , ఐసీసీ సభ్యులు , రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ని కోరినట్లు తెలిసింది .
ఒకప్పుడు తిరుగులేని పార్టీ …. ఇప్పుడు బలహీనపడి జవసత్వాలు లేక కునారిల్లు తుంది . పార్టీని నడిపించేవాడు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది . చాలాకాలంగా అద్యక్షడులేక తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఏడాది కాలంగా దాన్ని నెట్టకొస్తున్నారు . ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం లో శశబిషలు మాని పూర్తీ కలం అధ్యక్షడిని నియమించాలని కాంగ్రెస్ కార్య కర్తలు , అభిమానులు కోరుకొంటున్నారు …..

Related posts

మొత్తం ఆఫ్ఘనిస్థాన్ కోసం మా పోరాటం: అహ్మద్ మసూద్ ప్రతినిధి!

Drukpadam

ఆసుప‌త్రి బెడ్‌పై అచేతనావ‌స్థ‌లో లాలూ!… అలా చూస్తూ నిలుచుండిపోయిన నితీశ్!

Drukpadam

ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు…ఆనంద్ మహీంద్ర చలోక్తులు!

Drukpadam

Leave a Comment