Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

 ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

  • ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • ఈ నెల 21న పదవీ బాధ్యతల స్వీకరణ
  • విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కార్యక్రమం 

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమితురాలైన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 21న రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ (రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం)లో ఆదివారం ఉదయం 11 గంటలకు షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. 

మూడేళ్ల కిందట తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలికి పోటీకి దూరంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి తన పార్టీని కూడా విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ జనవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఏపీలో అన్నాచెల్లెలు చెరొక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. సీఎం జగన్ వైఎస్సార్సీపీ అధినేత కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్. 

కాగా, ఈ నెల 21న షర్మిల ప్రమాణస్వీకారోత్సవానికి ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ తదితర కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు.

Related posts

దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లారు: మంత్రి పయ్యావుల

Ram Narayana

జగన్ కోసం నేను చేసిన త్యాగాల మాటేమిటి?: విమర్శకులకు మోపిదేవి ఎదురు ప్రశ్న

Ram Narayana

Leave a Comment