Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: దామోదర రాజనర్సింహ

  • సచివాలయంలో వైద్య అధికారులతో మంత్రి సమీక్ష
  • నాణ్యమైన ఎంసీహెచ్, న్యూట్రిషన్ కిట్స్‌లను కొనుగోలు చేయాలని సూచన
  • నిర్ణీత సమయానికి సరఫరా చేయాలన్న మంత్రి

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని… వాటిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో నిర్మిస్తోన్న మెడికల్ కాలేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. నాణ్యమైన ఎంసీహెచ్, న్యూట్రిషన్ కిట్స్‌లను కొనుగోలు చేయాలన్నారు. వాటిని నిర్ణీత సమయానికి సరఫరా చేయాలన్నారు. టీఎస్ఎంఎస్‌ఐడీసీ ద్వారా నిర్మిస్తున్న వైద్య కళాశాలల భవనాల నిర్మాణం, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, కళాశాలల సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

Related posts

ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం: డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Ram Narayana

ఛత్తీ‌స్​ గఢ్ విద్యుత్​ కొనుగోలు విషయంలో కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన కమిషన్…

Ram Narayana

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

Ram Narayana

Leave a Comment